OREO PAKODAS : పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. ఒక్కోరి రుచి ఒక్కోలా ఉంటుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇప్పటి వరకు చాలా వెరైటీ రకాల డిషెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ డిషెస్ కొందరికి నచ్చితే మరికొందరికి మాత్రం అంతగా నచ్చవు. ఎవరి రుచికి తగ్గట్లు వారు ఉంటారు కాబట్టి ఈ విషయం గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక వెరైటీ వంటకం ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా (viral) మారుతోంది. ఎక్కడ చూసినా ఆ వంటకానికి సంబంధించిన వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఆ వంటకం గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
SBI: SBI వినియోగదారులకు అలెర్ట్… ఆ సర్వీస్ లో మార్పులు …!
అహ్మదాబాద్ లో వెరైటీ రుచి..
ఈ వెరైటీ వంటకం గుజరాత్ (gujarat) రాష్ర్టంలోని అహ్మదాబాద్ లో పుట్టింది. అక్కడ ఉన్న ఒక స్ట్రీట్ లో ఓ పకోడి బండి వద్ద ఒక వ్యక్తి ఈ వెరైటీ వంటకాన్ని తయారు చేస్తున్నాడు. చాలా మంది ఈ వంటకాన్ని ఎగబడి తింటున్నారు. ఈ వంటకం కోసం అతడు కేవలం మనకు తెలిసిన ఓరియో బిస్కెట్లు (oreo bisckets) మరియు శెనగపిండిని మాత్రమే వాడడం విశేషం.
Mango Leaves: మామిడి పండే కాదు ఆకులతో కూడా ఆరోగ్య ప్లస్..!!
వెరైటీ టేస్ట్ తో…
ఈ వెరైటీ వంటకం కోసం అతడు కేవలం ఓరియో బిస్కెట్లు శెనగపిండే వాడాడు. కానీ వాటిని ఎవరూ ఊహించని విధంగా వాడడంతో వెరైటీ వంటకం తయారయింది. ఇంతకీ అతడు ఏం చేశాడా అని ఆలోచిస్తున్నారా.. మరేం లేదండీ.. అతడు ఓరియో బిస్కెట్లను శెనగ పిండిలో ముంచి వాటికి బంగారు రంగు వచ్చేంత వరకు నూనెలో వేయించాడు. ఆ తర్వాత వాటిని బయటకు తీసి ప్లేట్ 20 రూపాయల చొప్పున ఓరియో పకోడి (pakodas) అని అమ్ముతున్నాడు.
జనం ఈ పకోడీలను ఎగబడి తింటున్నారు. మీకు టైం దొరికితే ఈ వెరైటీ ఓరియో పకోడీలను తయారు చేసి చూడండి. మీతో పాటు మీ పిల్లలు కూడా ఈ వెరైటీ స్నాక్ ను చూసి చాలా థ్రిల్ అవుతారు.