political ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

New Chandrababu: మహానాడులో ఈ వింత చూసారా..!? బాబోరి రంగు మార్చినట్టున్నారు..!?

Share

New Chandrababu: వరుసగా రెండో సంవత్సరం కూడా కరోనా కారణంగా జూమ్ కాన్ఫరెన్సులోనే తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడం జరిగింది.యథాప్రకారం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టిడిపి నేతలందరూ దుయ్యబట్టారు.

Have you seen this strange thing in Mahanadu ..!?
Have you seen this strange thing in Mahanadu ..!?

కరోనాను అదుపు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నది వారి ప్రధాన ఆరోపణ కాగా జగన్ ప్రభుత్వా ఒత్తిడి తట్టుకోలేకే నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ నికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెడుతున్నా వారిని అరెస్టు చేసి పోలీసుల చేత హింసి౦ప చేస్తున్నదన్నది మరో ప్రధాన విమర్శ.ప్రభుత్వ ఒత్తిళ్లు, పోలీసుల హింసాత్మక చర్యలు భరించలేకనే నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ లాంటి వారు గుండెనొప్పితో మరణించారని కూడా టిడిపి వాపోయింది.ఈజూమ్ కాన్ఫరెన్స్ లోనే వైసిపి ప్రభుత్వంపై ఎన్నెన్నో ఆరోపణలు విమర్శలను టిడిపి నేతలు చేసారు.ప్రతిపక్ష పార్టీ నిర్వహించే మహానాడు కార్యక్రమాల్లో ఇంతకంటే భిన్నంగా ఏదో జరుగుతుందని ఊహించటం అవివేకం .ప్రభుత్వాన్ని దుయ్యబట్టడానికే ఇలాంటి వేడుకలను ప్రతిపక్ష పార్టీ అయినా ఉపయోగించుకుంటోంది.ఇది కామనే కాబట్టి ఇందులో కొత్తదనం ఏమిటి అని తరచి చూస్తే ఒక వింత కనిపించింది.

Read More: Note for Vote Case: ఏం మాయ చేసావు బాబూ..!? ఓటుకి నోటు నుండి తప్పించుకున్నట్టేనా..!?

New Chandrababu: పసుపు పై మనసు విరిగిపోయిందా?

తెలుగుదేశం పార్టీకి పండగ వంటి మహానాడులో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ కలర్ చొక్కా వేసుకున్నారో ఒక్కసారి తదేకంగా చూడండి! తెల్ల చొక్కాలో ఆయన మెరిసిపోతున్నారు.మరి టీడీపీ బ్రాండ్ గుర్తయిన ఎల్లో కలర్ షర్ట్ ఏమైందబ్బా ? పార్టీ కార్యక్రమాలంటే పసుపు రంగు చొక్కాతోనే హాజరుకావటం చంద్రబాబునాయుడుకి ఆనవాయితీ. గతంలో ఈ విషయమై చంద్రబాబునాయుడు పార్టీ వారికి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు .పార్టీ కార్యక్రమాల్లో పచ్చ చొక్కాల తో పాల్గొనాలని ఆయన హుకుం జారీ చేశారు కానీ గురువారం జరిగిన వర్చువల్ మహానాడులో ఆయన తెల్ల చొక్కాతో దర్శనమిచ్చారు!మిగిలిన పార్టీ నాయకులందరూ పసుపు చొక్కాల తోనే ప్రత్యక్షమయ్యారు.నారా వారు మాత్రం పసుపు రంగు చొక్కాను వేసుకోలేదు.పసుపు రంగు అచ్చిరావడం లేదని చంద్రబాబు ఏవైనా సెంటిమెంట్ పెట్టుకున్నారా,అందుకే మహానాడుకు కూడా తెల్ల చొక్కాతో వచ్చారా అన్నదే ఇప్పుడు టిడిపిలో హాట్ టాపిక్ గా మారింది.తండ్రే గాదు తనయుడు లోకేష్ కూడా తెల్ల చొక్కాతోనే ఈ జూమ్ కాన్ఫరెన్స్లో పాల్గొనడం కొసమెరుపు.మొత్తమ్మీద తండ్రీ కొడుకులకు పసుపు రంగు పై పై మనసు విరిగిపోయినట్లు కనిపిస్తోంది.

 


Share

Related posts

బెల్ ఉద్యోగాల గంట మోగించింది..!!

bharani jella

బ్రేకింగ్: కరోనాతో మృతి చెందిన ప్రముఖ టాలీవుడ్ నటుడు వేణుగోపాల్

Vihari

మూడు రాజధానులపై ‘బొత్స’ ఆసక్తికర కామెంట్స్..!

somaraju sharma