Doorways: ఇంటికి ఇన్ని  గుమ్మాలు  ఉండడం వలన  అనారోగ్యం   , వ్యభిచార అల‌వాట్లు, అనుకోని క‌ష్టాలు కలుగుతాయట!!

Share

Doorways:  ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉంటే మంచిది
ఇంటికి 2  గుమ్మాలు ఉంటే ఆ ఇల్లు  ( House) శుభ‌క‌ర‌ మైనది గా శాస్త్రం లో చెప్పబడింది.   నాలుగు  ఆగుమ్మాలు ఉన్న ఇల్లు ఆరోగ్యాన్ని ఇస్తుంది. శ్ర‌మ‌కు త‌గిన  ఫలితం దక్కుతుంటుంది. గౌరవ ప్ర‌తిష్టలు కలిగేలా చేస్తుంది.  ఆరు గుమ్మాలు ఉన్న ఇంట్లో ఐశ్వర్యము  తో పాటు పుత్రవృద్ది శ్రేయస్సు పొందగలుగుతారు.  ఎనిమిది గుమ్మాలు  ఉన్న ఇల్లు  అష్టైశ్వర్యాలు  ఇస్తుంది. సకల భోగభాగ్యములు క‌లుగుతాయి. 12 గుమ్మాలు కలిగిన ఇల్లు  మంచి చ‌దువు, ఉద్యోగ, వ్యాపారములలో వృద్ధి తో పాటు  కీర్తిని  ఇస్తుంది.  14  గుమ్మాలు   ఉన్న ఇల్లు ధన సంపద, కుటుంబ వృద్ధి కి కారణం అవుతుంది. 16  గుమ్మాలు  గల ఇంటిలో  అన్నింటా లాభములు కలగడం తో పాటు  అధికారమును, జీవనంలో లాభాలను పొందేలా చేస్తుంది.

Doorways:  అధిక ఖర్చులతో ఆర్థిక బాధ‌లు

అయితే మనకు  ఎన్ని గుమ్మాలు ఉంటే మంచిది కాదునష్టం కలుగుతుంది  అనేది తెలుసుకుందాం.  ఇంటికి 3  గుమ్మాలు ( Doorways)  ఉంటే    శత్రువుల వలన బాధలు, అపనిందలు రావడం  తో పాటు   అధిక ఖర్చులతో ఆర్థిక బాధ‌లు  కలుగుతాయి. 5 గుమ్మాల తో ఉన్న  ఇల్లు సంతానానికి సంబంధించిన పీడలు కలుగ చేయడం , రోగ బాధలు కలగడం తో పాటు , శత్రువుల నుండి ఇబ్బందులు కలిగేలా చేస్తుంది. 7 గుమ్మాలు తో ఉన్న  ఇంట్లో అనారోగ్యం కలగడం , వ్యభిచార అల‌వాట్లు, అనుకోని క‌ష్టాలు  ఎదురుకోవాల్సి ఉంటుంది అని  శాస్త్రం  లో చెప్పబడింది. 9 గుమ్మాలు  ఉన్నఇంటివలన   శరీర పీడను కలిగించడం తో పాటు యజమానికి నష్టాన్నిమిగులుస్తుంది. 10 గుమ్మాలు  కలిగి ఉన్న ఇల్లు కష్టనష్టాలను  కలిగించడం తో పాటు , ఆ ఇంటికి దొంగల వలన భయం కూడా ఉంటుంది. 11 గుమ్మాలు ఉన్న    ఇల్లు వలన   అష్టకష్టాలు కలగడం తో పాటు, భార్య వ్యభిచారము చేసేలా పరిస్థితి కలుగుతుంది. 13 గుమ్మాలు  ఉన్న ఇల్లు వలన  మరణ  ప్రమాదాలు  కలగడం తో పాటు , కష్టనష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 15 గుమ్మాలు  ఉన్న ఇల్లు వలన అనేక కష్టాలు రావడం ,బాధలు కలగడం ,అశాంతి గా ఉండడం తో పాటు ,అధిక ఖర్చులు కలిగేలా చేస్తుంది.

వాస్తు పండితుల స‌ల‌హాలు

వాస్తుశాస్త్రం  తెలియచేసిన  దాని ప్రకారం   గుమ్మాల సంఖ్య ఉంటే  ఆ ఇంట్లో నివసించే వారు ఆరోగ్యంగా , అన్యోన్యంగా  ఉండడం తో పాటు ఒకరి కొకరు సహకరించు కుంటూ  ఆనందం గా  రోజు రోజుకు  అభివృద్ధి చెందుతారు. అదే విధం గా శాస్త్రానికి తగినట్టు గా గుమ్మాల సంఖ్య  లేకపోతే కనుక ఆ కుటుంబంలో కలతలు, గొడవలు , అనారోగ్యాలు, ఇతర అనేక కష్టనష్టాలను భరించవలిసి వస్తుంది .  గుమ్మాల సంఖ్య ఏప్పుడుకూడా సరిసంఖ్య లో ఉండే విధం గా చూసుకోవాలి.  కాబట్టి గుమ్మాలు పెట్టుకునేటప్పుడు  వాస్తు పండితుల స‌ల‌హాలు ,సూచనలు  అడిగితెలుసుకుని అనుసరించడం మంచిది.


Share

Related posts

యువతి ముఖంపై యాసిడ్ దాడి..! తెలంగాణలో దుర్ఘటన..!!

somaraju sharma

ఇక తెలంగాణ లోనూ జగన్ ఫార్ములా…! కేటీఆర్ కీలక నిర్ణయం

arun kanna

పెద్దలు కుదిర్చిన పెళ్లి లో ఉన్న మజా ఇదే!! (పార్ట్ -1)

siddhu