HBD Avika Gor: ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది అవికా గోర్.. వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ యంగ్ బ్యూటీ.. మెగా హీరో కళ్యాణ్ దేవ్, అవికా గోర్ జంటగా ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. నేడు అవికా గోర్ పుట్టినరోజు సందర్భంగా ప్రొడక్షన్ నెంబర్.3 లోని అవికా గోర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్..!!

Read More: Sabhaku Namaskaram: సభకు నమస్కారం అంటూ వచ్చేస్తున్నాడు అల్లరినరేష్..!!
ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమర్పణలో వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్, టిజి విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రం ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకుంది ఇందులో హీరోయిన్ కళ్యాణ్ దేవ్ సతీమణిగా శ్రీజ కనిపించడం విశేషం. తాజాగా అవికా గోర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. సోషల్ మీడియాలో అవికా గోర్ ఫస్ట్ గ్లింప్స్ వైరల్ అవుతోంది.. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు మేకర్స్.