HBD Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఈ పేరు తెలియని వారుండరు.. జబర్దస్త్ కామెడీ షో తో పాపులరైన సుధీర్.. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా సినీ అరంగేట్రం చేశాడు.. ప్రస్తుతం సుధీర్ హీరోగా నటిస్తున్న రెండవ సినిమా గాలోడు.. ఈరోజు సుడిగాలి సుదీర్ పుట్టినరోజు సందర్భంగా గాలోడు సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు..!!
సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లో చేస్తున్న పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు.. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.. అదే క్రేజ్ తో ఇప్పుడు హీరోగా నిలదొక్కుకోకున్నాడు.. సిగరెట్ నోట్లో పెట్టుకొని దేని గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నాడు సుధీర్ ఈ పోస్టర్లో. ఈ సినిమా నుంచి విడుదలైన సుధీర్ మాస్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సంస్కృతి బ్యానర్ పై నిర్మిస్తున్నారు.