HBD Sumanth Ashwin: తూనీగ తూనీగ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు సుమంత్ అశ్విన్.. హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.. ఇటీవల ఓ ఇంటివాడైన సుమంత్ అశ్విన్ నిర్మాతగా మారనున్నాడు.. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ ఇదే మా కథ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. నేడు సుమంత్ అశ్విన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ సినిమాలోని సుమంత్ అశ్విన్ లుక్ ను రిలీజ్ చేస్తూ వీడియోను విడుదల చేశారు..
గురు పవన్ దర్శకత్వంలో రోడ్ జర్నీ నేపథ్యంలో రూపొందుతుంది ఇదే మా కథ సినిమా. ఈ చిత్రంలో భూమిక చావ్లా, తాన్యా హోప్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ గొల్ల అ నిర్మించారు. ఈ సినిమాకు రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఆర్ గా జునైద్ సిద్ధిఖీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది అలాగే ఈ సినిమా తాజాగా సెన్సార్ కూడా పూర్తి పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ కూడా పొందింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.. సుమంత్ అశ్విన్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని.. హీరోగా, నిర్మాతగా ఎదగాలని “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది..
Team #idheMaaKatha Wishing Hero #Sumanth_Ashwin A Very Happy Birthday ?? @actorsrikanth #SumanthAshwin @bhumikachawlat @TanyaHope_offl @GuruDepuru @gp_productions7 #MaheshGolla @RamprasadDop @kasyapsunil6#HBDSumanthAshwin pic.twitter.com/B6wRUAW3Gx
— VamsiShekar (@UrsVamsiShekar) June 30, 2021