NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఏటీఎం మెషిన్ మీద పెట్రోల్ పోసి తగలపెట్టాడు.. కొన్ని గంటల్లోనే భారీ ట్విస్ట్ !!

ఏటీఎం మెషిన్ మీద పెట్రోల్ పోసి తగలపెట్టాడు.. కొన్ని గంటల్లోనే భారీ ట్విస్ట్ !!

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి అనివార్య కారణాల వల్ల దొంగగా మారాడు. పక్కాగా ప్లాన్ రెడీ చేసుకుని ఏటీఎం దొంగతనానికి సిద్ధపడ్డాడు.

ఏటీఎం మెషిన్ మీద పెట్రోల్ పోసి తగలపెట్టాడు.. కొన్ని గంటల్లోనే భారీ ట్విస్ట్ !!

మనోజ్ కుమార్ అనే వ్యక్తి ముక్కడిపేట లో నివసిస్తున్నాడు. అతడొక కూలి. అయితే, ఏ కారణం చేతనో తెలియదు కానీ అతను దొంగగా మారాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తే కాలం గడుపుతున్నాడు. ఇలా కొంచెం కొంచెం డబ్బు కోసం ఇంత కష్టపడం అనవసరం అనుకుని పెద్దగా డబ్బు రావడం కోసం ఏం చెయ్యాలో ఆలోచించడం మొదలు పెట్టాడు. బాగా అలోచించి ఏటీఎం దొంగతనానికి ప్లాన్ చేసాడు. 

అతడు కెడిగెనహళ్లి గ్రామంలోని ఓ ఏటీఎంను తన టార్గెట్ గా చేసుకున్నాడు. అర్ధరాత్రి దాటాక అయితే జనాలు తిరిగే ఛాన్సు చాలా తక్కువ కాబట్టి ఏటీఎంను అప్పుడు పగలగొట్టి డబ్బు తెచ్చుకుందామనుకున్నాడు. కానీ అతడి ప్రయత్నం ఫలించలేదు. వరుసగా నాలుగు రోజుల పాటు ప్రయత్నించినా ఆ ఏటీఎంను అతను తెరవలేకపోయాడు. దీంతో అతడికి చిరాకు వచ్చి దాని మీద పెట్రోల్ పోసి తగలబెట్టి ఇంటికి తిరిగివెళ్ళాడు.

మనోజ్ ఇంటికి తిరిగొచ్చాక ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. ఫ్రెండ్ కు ఫోన్ చేద్దామనుకుని తెల్లారి నిద్రలేచాక చూస్తే అతని ఫోన్ కనిపించలేదు. తరువాత ఆలోచిస్తే గుర్తొచ్చింది. నిన్న రాత్రి తన ఫోన్ ను ఏటీఎం మెషీన్ వద్దే మర్చిపోయినట్టు అతడికి గుర్తుకొచ్చింది. 

తాను పోలీసులకు దొరికిపోవడం ఖాయమని మనోజ్ కి అర్ధం అయ్యింది. అతనికి ఒకటే  పరిష్కారం తోచింది. ఎవరికీ ఏమి చెప్పకుండా తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. అప్పటికే  హిందూపురం పోలీసులకు ఏటీఎంను తగలబెట్టిన విషయం తెలియడంతో వారు విచారణ మొదలుపెట్టారు. ఇంతలో మనోజ్ ఆత్మహత్య గురించి కూడా వారికి సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు ఆ మొబైల్ మనోజ్ దేనని నిర్ధారణ చేసుకున్నారు. 

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N