NewsOrbit
న్యూస్

ఆయనకున్నది ! ఈయనకు లేనిది ఏమిటి?

లౌక్యమే బిజెపి నూతన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విజయ రహస్యంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.అది లోపించే మాజీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ కోరి కష్టాలు కొని తెచ్చుకున్నారని విశ్లేషిస్తున్నారు.

 

రాజ‌కీయాల్లో పంతాలు.. ప‌ట్టుద‌ల‌లు ఎంత ఉండాలో.. అంతే రీతిలో లౌక్యం కూడా ఉండాల‌ని అంటారు రాజ‌కీయ పండితులు. ఈ విష‌యంలో కొంద‌రు నాలుగాకులు ఎక్కువే చ‌దువుతారు. అయితే, కొంద‌రు లౌక్యాన్ని ప‌క్క‌న పెట్టి ముందుకు సాగుతారు. కానీ, ఇలాంటి వారు ఎక్కువ కాలం రాజ‌కీయాల్లో కొన‌సాగిన సంద‌ర్భాలు మ‌న‌కు క‌నిపించ‌వు. గ‌తంలో రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన టీడీపీ వ్య‌వ‌స్థాప‌క‌ అధినేత  నంద‌మూరి తార‌క‌రామారావు కూడా లౌక్యం తెలిసిన రాజ‌కీయాలు చేయ‌లేక‌పోయార‌నే పెద్ద విమ‌ర్శ‌ల‌నే ఎదుర్కొన్నారు. ఈ త‌ర‌హా లౌక్యం ఆయ‌న ప్ర‌ద‌ర్శించ‌క‌పోవ‌డం వ‌ల్లే.. అనేక సంద‌ర్భాల్లో పార్టీ ఇబ్బందుల్లో ప‌డిపోయింది


నిజానికి రాజ‌కీయ లౌక్యం తెలిసిన నాయ‌కుడిగా చంద్ర‌బాబుకే ఎక్కువ మార్కులు ప‌డుతున్నాయి. ఇక‌, తాజాగా ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ప‌గ్గాలు చేప‌ట్టిన సోము వీర్రాజు చాలా లౌక్యంగా ముందుకు సాగుతున్నార‌నే వాద‌న అప్పుడే వినిపించ‌డం గ‌మ‌నార్హం నిజానికి ఆయ‌న ప‌గ్గాలు చేప‌ట్టి.. ఇంకా రెండు రోజులు కూడా గ‌డ‌వ‌లేదు. కానీ, కీల‌క‌మైన రాజ‌ధాని, ప్ర‌త్యేక హోదా వంటి అంశాల‌పై నిర్మొహ‌మాటంగా మాట్లాడుతూనే.. లౌక్యంగా వాటి నుంచి త‌ప్పించుకుంటున్నారు. రాజ‌ధాని విష‌యంలో త‌మ పార్టీకి ఒక స్టాండు ఉంద‌ని అంటూనే .. గ‌తంలో చంద్ర‌బాబు అమ‌రావ‌తిని ఎంచుకుని మ‌మ్మ‌ల్ని, మా అభిప్రాయాన్ని అడిగారా? అని ప్ర‌శ్నించారు.

అంతేకాదు, ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం మ‌మ్మ‌ల్ని అడిగాడా? అప్ప‌ట్లో మేం కాదు, ఔను అనే స‌ల‌హాలు చెప్పి ఉంటే.. ఇప్పుడు కూడా మాట్లాడేందుకు స్కోప్ ఉంటుంది! అంటూ త‌న‌దైన శైలికి లౌక్యం చేర్చి ప్ర‌శ్నించారు. ఇక‌, హోదా విష‌యాన్ని మాట్లాడుతూ.. హోదాను మించిన ప్యాకేజీ ఇస్తానంటే.. ఏ రాష్ట్రం మాత్రం వ‌ద్దంటుంది? అంటూ ప్ర‌శ్నించారు. అంటే త‌ద్వారా ఆయ‌న హోదాను కాద‌ని, ఔన‌ని అంటూనే.. ప్యాకేజీని స‌మ‌ర్ధించారు. ఇది నిజంగా రాజ‌కీయాల్లో ఉండాల్సిన ప్ర‌ధాన లౌక్యం. గ‌త బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా లక్ష్మీనారాయ‌ణ ఈ త‌ర‌హా లౌక్యం చేయ‌లేక పోయార‌నేది నిర్వివాదాంశం.


తాను గుంటూరుకు చెందిన నాయ‌కుడిన‌నో.. లేక మ‌రేదైనా ఒత్తిళ్లు ఉన్నాయో.. ఇవేవీ కాక‌.. తానే సీనియ‌ర్ పొలిటీషియ‌న్ అని అనుకున్నారో.. తెలియ‌దు కానీ, రాజ‌ధాని విష‌యంలో బీజేపీ కేంద్ర నాయ‌కుల మాట‌ల‌కు క‌న్నా మాట‌ల‌కు పొంత‌న లేకుండా పోయింది. ఇక‌, హోదా విష‌యంలోనూ ఆయ‌న క‌ట్టె విరిచిన‌ట్టు మాట్లాడారు. ఈ ప‌రిణామాల ప్ర‌భావం.. ఆయ‌న‌ను పార్టీలో అధ్య‌క్ష ప‌ద‌వికి దూరం చేసింద‌నేది పూర్తిగా వాస్త‌వం.

ఇప్పుడు సోము.. అన్ని ప‌రిణామాల‌కు గ‌ణాంకాలు వేసుకుని.. లౌక్యంగా ముందుకు సాగుతున్న తీరు.. స్ప‌ష్టంగా ఆయ‌న‌కు మంచి మార్కులు ప‌డేలా చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు.నిజానికి సోము వీర్రాజు కూడా దూకుడున్న నాయకుడే!కానీ కాలానికి అనుగుణంగా ఆయన రాజకీయ ప్రయాణం సాగుతోందని ఆయనకు మంచి భవిష్యత్తు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

author avatar
Yandamuri

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju