చిరంజీవి, మహేష్, నాగార్జున కాదు! ఎమ్మెల్యే రోజాకు ఇష్టమయిన హీరో అతనే!!

ప్రస్తుతం రోజా సెల్వమణి అటు జబర్దస్త్ జడ్జిగా అలాగే ఎమ్మెల్యేగా తన బాధ్యతలతో  ఎంతో  బిజీగా ఉంది. ఈ రెండు వృత్తులను సరిగ్గా బ్యాలెన్స్ చేస్తుంది రోజా. అప్పుడప్పుడు ఈవెంట్స్ లో కూడా కనిపించి కనువిందుచేస్తుంది. అంతేకాదు ఈమె ఇప్పటికే వందకు పైగా సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం రోజాకు ఇష్టమయిన హీరో ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే దీనికి సమాధానం మరింత ఆసక్తికరంగా మారింది.

రోజాని ఇష్టమయిన హీరో ఎవరంటే ఆమె నటించిన వాళ్ల పేర్లలో ఎవరిదైనా చెప్తుందేమో అనుకుంటే రోజా మాత్రం ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చింది. కనీసం ఒక్క సినిమాలో కూడా ఆయనతో కలిసి లీడ్ రోల్ లో చెయ్యకుండానే ఆ హీరో అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది రోజా. మరి రోజాకు అంతగా ఇష్టమయిన హీరో ఎవరో తెలుసా? 

మాస్ మహరాజా రవితేజ అంటే తనకు చాలా ఇష్టమని రోజా చెప్తుంది. మాస్ రాజా రవితేజ నటనకు, తన కామెడీ, టైమింగ్ కు తాను ఫిదా అయిపోయానని చెప్పింది రోజా. ఇటీవల రోజా ఓ ఇంటర్వ్యూ లో  మాట్లాడుతూ తాను రవితేజ నటించిన ఒక్క సినిమా కూడా వదలకుండా చూస్తానని ఆయన నటించిన ప్రతీ సినిమాను ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చింది.

రవితేజలో మరీ ముఖ్యంగా కామెడీ యాంగిల్ తనకు చాలా ఇష్టమని చెప్పింది రోజా. రోజాతో పాటుగా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కూడా ఫేవరెట్ హీరో  రవితేజ నే అంటే. మాస్‌ ఆడియన్స్ లో భీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నది హీరో రవితేజ మాత్రమే. గతంలో రోజా, రవితేజ కలిసి  శంభో శివ శంభో, వీర, తిరుమల తిరుపతి వేంకటేశ సినిమాలలో నటించారు.