ఆరు లక్షల తేనెటీగలను శరీరంపైకి ఎక్కించుకున్నాడు.. చివరికి?

సాధారణంగా ఒక తేనెటీగ కుడితే ఆ ప్రదేశమంతా వాపు వచ్చి ఎంతో మంటగా అనిపిస్తుంది. కొన్నిసార్లు తేనెటీగలు దాడి చేసినప్పుడు ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం లేదా కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుంది. ఇంతటి ప్రమాదకరమైన తేనెటీగలతో
కొందరు విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. ఇలాంటి కోవకు చెందినవారే రువాన్ లియాంగ్‌మింగ్ . ఈ వ్యక్తి సుమారుగా ఆరు లక్షల తేనెటీగలను తన శరీరంపై ఎక్కించుకొని అందరిని ఆశ్చర్య పరిచాడు…

చైనాకు చెందిన రువాన్ లియాంగ్ మింగ్‌ అనే వ్యక్తికి తేనెటీగలు అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే అతని శరీరంపై ఒకటి కాదు, రెండు కాదు సుమారుగా ఆరు లక్షల తేనెటీగలను తన శరీరంపై ఎక్కించుకొని ఫీట్ చేయడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యంతో నోళ్ళు వెల్ల పెట్టారు. మింగ్‌ అనే వ్యక్తి కి తేనెటీగలు అంటే ఇష్టం ఉండటం వల్ల ఎంతో ఇష్టం ఈ ఫీట్ చేశానని చెప్పారు. ఈ ఫీట్ చేస్తున్నప్పుడు అతని శరీరం తో ఏమాత్రం గాయం కాకుండా ఫీట్ చేసినందుకుగాను అతనినిHeaviest mantle of bees అనే రికార్డును కైవసం చేసుకున్నాడు.

రువాన్ లియాంగ్ మింగ్‌ తేనెటీగల తో ఫీట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో అద్భుతంగా ఫీట్ చేశారని కామెంట్ చేశారు.మింగ్‌ మాట్లాడు తేనెటీగల తో డీల్ చేస్తున్నప్పుడు ఏ మాత్రం కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండటం వల్ల వాటి నుంచి మనకి ఏ ప్రమాదం ఉండదని తెలిపారు. తేనెటీగలకు ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందని తెలిసినప్పుడు మాత్రమే అవి మనల్ని కుడతాయి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తేనెటీగలు సరిగా లేవని తెలిస్తే మాత్రం మనం చేసే ప్రయత్నాన్ని విరమించుకోవడం ఎంతో ఉత్తమమని ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డ్ హోల్డర్ రువాన్ లియాంగ్ మింగ్‌ తెలియజేశారు.