NewsOrbit
న్యూస్

గన్నవరంలో వంశీకి పూర్తిగా ఎదురుగాలి!సర్వే చెబుతున్న సత్యమిదే!!

పార్టీ మారినంత సులువు కాదు ప్రజలను కన్విన్స్ చేయడమంటే ! ఒక పార్టీ తరఫున గెలిచి సంవత్సరంలోపే ఇంకో పార్టీలోకి దూకేస్తే గెలిపించిన ప్రజలు రియాక్టు కాకుండా వుండరు.

తగిన సమయం కోసం వాళ్లు ఎదురుచూస్తుంటారు.ఇదే ఇప్పుడు గన్నవరంలో నియోజకవర్గంలో జరుగుతోందట .మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రపంచాన్ని ఎదురొడ్డి మరీ గన్నవరంలో గెలుపొందిన టిడిపి అభ్యర్థి వల్లభనేని వంశీ అకస్మాత్తుగా వైసిపికి మద్దతు ప్రకటించేశారు.ఆయనైతే వైసిపిలో కొచ్చారు కాని ఆయన వెంట టిడిపి వారెవరూ రాలేదట.అవసరమైతే గన్నవరం ఎమ్మెల్యే పదవికిరాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికలలో నిలబడతానని వంశీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన విజయావకాశాలు ఎలా ఉంటాయన్న దానిపై ఒక సర్వే జరిగింది.

 

ఈ సర్వే ఫలితం వంశీకి పూర్తి వ్యతిరేకంగా రావటం ఇక్కడ గమనార్హం.గన్నవరంలో వైసీపీ తరుఫున వంశీ నిలబడితే.. ఆయనకు పోటీగా టీడీపీ తరుఫున ఎవరు నిలబడినా టీడీపీకే 54శాతం ఓట్లు వస్తాయని తేలిందట.. ఎందుకంటే  వంశీకి ఓట్లు వేస్తే ఇప్పుడు మమ్మలను ముంచిపోయాడని.. అతడి స్వార్థం కోసం పార్టీ మారాడని జనాలు అభిప్రాయపడుతున్నారట..అదేవిధంగా రియల్ వైసీపీ నాయకులు అయిన దుట్టా రామచంద్రారావు వైఎస్ఆర్ కుటుంబం కి దగ్గరివారు.. ఆయన మనషులు కూడా మాకు అభిమానం ఉన్నా కూడా వంశీని ఓడగొడుతాం అని స్పష్టం చేస్తున్నారట….ఇక మొన్నటి ఎన్నికల్లో పోటీచేసిన వెంకట్ రావు మనుషులు కూడా అదే విధంగా చెప్తున్నారట.

ఆ నియోజకవర్గంలో మొత్తం 3200 శాంపిల్స్ చేశారంట.. దానిలో టీడీపీ నుంచి క్యాండిడేట్ ఎవరైనా సరే.. టీడీపీకే ఓటు వేస్తాం అని ఏకంగా 54శాతం మంది చెప్పారంటే వంశీ మీద ఎంత వ్యతిరేకత నియోజకవర్గంలో ఉందో చెప్పకనే చెప్తోందని పలువురు అంటున్నారు.మామూలుగానే గన్నవరం నియోజకవర్గం టిడిపికి కంచుకోట.టిడిపి ఆవిర్భావం తర్వాత ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ గానీ మరో పార్టీ గాని గెలిచింది ఒకటి ..రెండు సార్లే !మొన్నకూడా వంశీని గెలిపిస్తే ఆయన పార్టీ మారడాన్ని టిడిపి వర్గాలు సహించలేక ఉన్నాయి.వైసీపీ వర్గాలు ఆయన రాకను స్వాగతించటం లేదు.ఈ నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ రాజకీయంగా పతనావస్థకు చేరుకున్నట్టే నని పరిశీలకులు భావిస్తున్నారు.వంశీతో పాటు పార్టీ మారిన మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉండకపోవచ్చును అన్నది పరిశీలకుల అంచనా.

author avatar
Yandamuri

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju