Ashwagandha Tea: అశ్వగంధ టీ ఎవరికి మేలు చేస్తుందంటే..!?

Share

Ashwagandha Tea: పురాతన కాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో అశ్వగంధ ను విరివిగా ఉపయోగిస్తున్నారు.. ఈ మూలిక ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.. అశ్వగంధ టీ ఎప్పుడైనా తాగారా.. ఈ టీ రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది.. ఈ టీ రోజు తాగితే ఎటువంటి ఆరోగ్య సమస్యలను నయం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Health Benefits Of Ashwagandha Tea:
Health Benefits Of Ashwagandha Tea:

శతాబ్దాలుగా సంప్రదాయ ఔషధాలలో అశ్వగంధ ఉపయోగిస్తున్నారు. ఇది ఒక అడప్టోజెన్. ఇది శరీరం లోని హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత వలన కలిగే మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది. డిప్రెషన్, యాంగ్జైటీ పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. నాడీ వ్యవస్థను చురుకుగా ఉంచుతుంది. మెదడు పనితీరును వేగవంతం చేస్తుంది.

Health Benefits Of Ashwagandha Tea:
Health Benefits Of Ashwagandha Tea:

అశ్వగంధ టీ తాగటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతుంది. ఈ టీ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తయి. అశ్వగంధ టెస్టోస్టిరాన్ ను విడుదల చేస్తుంది. ఇది మగవారిలో వీర్యకణాలు వృద్ధి చెందేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ టి చక్కటి ప్రత్యామ్నాయంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


Share

Related posts

ఎన్నికల ముందు విద్యార్థులపై దృష్టి

sarath

వకీల్ సాబ్ తర్వాత మరో భారీ ప్రాజెక్ట్ సెట్ చేసిన దిల్ రాజు.. అన్ని పాన్ ఇండియన్ సినిమాలకి గట్టి పోటీ ..!

GRK

‘అడుక్కోవడం కాదు పోరాడి సాధించాలి’

somaraju sharma