Chironji: చిరోంజీ పేరు మీరు వినే ఉంటారు.. ఇది ఒక డ్రై ఫ్రూట్.. దీని వలన ఎన్నో రకాల బెనిఫిట్స్ మనం పొందవచ్చు.. దీనిని ఎక్కువగా స్వీట్స్ షాప్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు.. చిరోంజీ డ్రై ఫ్రూట్ ను పొడి చేసుకుని పాలలో కలిపి ప్రతి రోజు తాగవచ్చు.. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!
చిరోంజీ లో విటమిన్ బి, సి ఉంటాయి. వీటితోపాటు అమైనో ఆసిడ్స్ కూడా ఉన్నాయి.. ఇందులో విటమిన్స్ సమృద్ధిగా లభిస్తాయి.. అలాగే ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.. దీనిని తీసుకోవడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది.. ఇంకా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.. దీనిని పొడి చేసుకుని పాలలో కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.. జలుబుని తగ్గిస్తుంది.. నీరసం ను తగ్గించే తక్షణ శక్తిని అందిస్తుంది.. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అల్సర్ సమస్యను తగ్గిస్తుంది..