Garuda Mukku: ప్రకృతి ఒడిలో ఎన్నో ఔషధ మొక్కలు.. వాటిలో ప్రతి ఒక్క మొక్క మానవాళికి ఏదో విధంగా సహాయపడుతునే ఉంటుంది.. అలాంటిది గరుడ ముక్కు మొక్క.. ఈ చెట్టు ఆకులు రాత్రిపూట ఆకాశం వైపు పైకి లేచి ఉంటాయి.. ఈ చెట్టు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. మరెన్నో అద్భుత రహస్యాలను కూడా ఈ చెట్టు కలిగి ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Garuda Mukku: గరుడ ముక్కు కాయలతో ఇలా చేయండి.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది..!!
ఈ చెట్టును గరుడ ముక్కు చెట్టు, గద్దాకు చెట్టు, తేలు కొండకు, తేలు కొండి చెట్టు, గొఱ్ఱె జిడ్డాకు వంటి పేర్లతో పిలుస్తారు.. ఈ చెట్టు ఆకులు, కాండం పట్టుకుంటే జిగట జిగటగా ఉంటాయి.. ఈ చెట్టు కాయలు ఎండిన తరువాత వాటిని తెచ్చుకుని మన ఇంటికి కట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ ని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. నరదిష్టి నీ తొలగిస్తుంది. ఈ కాయలను 3, 5, 11 , 18 ఎర్ర దారం తో కలిపి మన ఇంటి గుమ్మానికి కట్టుకుంటే నరపీడ, నరగోష, ఇంట్లో ఆర్థిక సమస్యలు గొడవలు, చికాకులు అన్నీ పోయి మానసిక ప్రశాంతతను, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగేలా చేస్తుంది. అంతటి శక్తి ఈ గరుడ ముక్కు కాయలకు ఉంది.
Garuda Mukku: ఈ కాయలతో క్షయ వ్యాధికి చెక్..!!
గరుడ ముక్కు కాయలను ఆయుర్వేద వైద్యంలో పూర్వ కాలం నుండి ఉపయోగిస్తున్నారు. పాము కాటు (Snake Bite), తేలు కుట్టిన చోట ఈ మొక్క ఆకులను ముద్దగా నూరి ఆ రసాన్ని దాని పైన వేసి ఆకులు ఉంచి కట్టుకడితే విషం విరిగిపోతుంది. తేలు కాటు కు చెట్టు ఆకులు పని చేసినంత త్వరగా మరి ఏ ఆకులు పని చేయలేవు. క్షయ వ్యాధితో బాధపడుతున్న వారు ఈ ఆకుల రసాన్ని దంచి మెడపై రాసుకుంటే క్షయవ్యాధి తగ్గిపోతుంది. ఈ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ కషాయాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించి చేస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.
గరుడ ముక్కు వేర్లను తీసుకొచ్చి దంచి పొడిచేసుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ పొడిని వేసి కలిపి రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి. ఇలా తాగడం వలన తలనొప్పి (Headache), జాయింట్ పెయిన్స్ (Joint Pain), ఛాతిలో కఫం ( Cough) వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ చెట్టు వేర్లను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి కషాయంలో తయారు చేసుకొని తాగితే అనేక ఆరోగ్య సమస్యలను దరి చేరనివ్వదు. ఈ చెట్టు పూలు మధుమేహాన్ని (Diabetes) తగ్గించడానికి సహాయపడుతాయి. కాలిన గాయాలు (Wounds) ఉన్నచోట ఈ చెట్టు వేరు పొడి కొబ్బరి నూనె లో కలిపి రాస్తే త్వరగా మానిపోతాయి.