NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Poppy Seeds: తలనొప్పి నుంచి ఉబ్బసం వరకు చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే గసగసాలు..!!

Poppy Seeds: From Headache to Bloating Many Health Benefits of Poppy Seeds in Telugu

Poppy Seeds: మనకు లభించే సుగంధ ద్రవ్యాలలో గసగసాలు ఒకటి.. తెల్లగా చిన్నగా ఉండే గసగసాలు ఏ రోజుల్లో మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నాం.స కానీ పూర్వం వీటిని మందుల తయారీలో ఉపయోగించేవారు.. గసగసాల నుండి నల్ల మందును తయారు చేస్తారు.. గసగసాలు కూరకి రుచిని అందించడంతోపాటు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. గసగసాలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Poppy Seeds: From Headache to Bloating Many Health Benefits of Poppy Seeds in Telugu
Poppy Seeds From Headache to Bloating Many Health Benefits of Poppy Seeds in Telugu

Poppy Seeds:  గసగసాల తో ఆ సమస్యలకు చెక్..!!

గసగసాలు లో క్యాల్షియం, పాస్ఫరస్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంది. ఇంకా వీటిలో అధిక మొత్తంలో థయామిన్, ఫోలెట్ ఉన్నాయి. అంతే కాకుండా లినోలెయిక్ ఆమ్లం ఎక్కువగా ఉంది. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి అనేక శరీర రుగ్మతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఫైబర్ మలబద్దకం (Constipation) నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోగ నిరోధక శక్తి (Immunity) ని పెంచుతుంది.

Health Benefits of Poppy Seeds
Health Benefits of Poppy Seeds

నోటి పూత (Mouth Ulcer) లను తగ్గించడానికి దోహదపడతాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. దృష్టి సమస్య లతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తీసుకోవాలి. గసగసాలు దృష్టిని మెరుగు పరుస్తాయి. ఉబ్బసం నుంచి తలనొప్పి వరకు అనేక రకాల ఔషధల తయారీలో గసగసాలను ఉపయోగిస్తారు.

Health Benefits of Poppy Seeds
Health Benefits of Poppy Seeds

శరీరం లో వేడి తగ్గించడానికి గసగసాలు అద్భుతంగా పనిచేస్తాయి. గసగసాలు ముందుగా కొన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. వాటిని మెత్తగా నూరుకోవాలి. ఇందులో కొంచెం పటిక బెల్లం కలిపి ప్రతి రోజు తీసుకుంటే శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. శరీరానికి చలువ చేస్తుంది. గసగసాలు, పటిక బెల్లం ఈ రెండింటినీ కలిపి పొడి చేసుకోవాలి. రోజుకు రెండు సార్లు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే జిగట విరోచనాలు (Viscous diarrhea ) తగ్గుతాయి. నిద్ర సరిగా పట్టడం లేదా అయితే నిద్రపోయే ముందు గసగసాలను తీసుకొని వేడి చేసి ఒక వస్త్రంలో వేసి మూటకట్టి వాటి వాసన చూస్తూ ఉంటే త్వరగా నిద్ర పడుతుంది. నిద్రలేమి (Insomnia) సమస్యతో బాధపడుతున్న వారికి గసగసాలు చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.

Health Benefits of Poppy Seeds
Health Benefits of Poppy Seeds

10 గ్రాముల గసగసాలు తీసుకొని వాటిని నానబెట్టి ముద్దగా నూరుకోవాలి. అందులో అర కప్పు పాలు కలపాలి. ఈ మిశ్రమంలో 20 గ్రాముల పటిక బెల్లం కలిపి రోజుకు రెండు సార్లు తాగుతూ ఉంటే వీర్య స్తంభన (Ejaculation)      తగ్గుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. సంతానోత్పత్తి (Fertility) సమస్యలను తగ్గిస్తుంది. గసగసాలను నీటిలో నానబెట్టి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత కుంకుడుకాయ రసం తో తలస్నానం చేయాలి .ఇలా చేయడం వల్ల చుండ్రు (Dandruff) తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు కుదుళ్లను సంరక్షిస్తుంది.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju