husband wife: భార్యాభర్తల మధ్య గొడవల వలన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం  కలుగుతుందో తెలుసుకోండి!!(పార్ట్1)

Share

husband wife:  భార్యాభర్తలు అన్న తర్వాత వారి మధ్య వాదనలు చాలా  సహజం. ఒకరు ఎస్ అంటే మరొకరు నో  అనడం ప్రతి చోట  జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి  గొడవలలో   ఒక్కొక్కసారి  ఒక్కొక్కరు గెలుస్తారు. కానీ ఇలా పోటీలు పడి  గొడవలు పడుతుంటే  ఆరోగ్యం విషయంలో ఇద్దరూ  ఓడిపోక తప్పదని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వాదనలు  ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకునేందుకు 2000 మంది పై లోతైన పరిశోధన జరిపారు.ఈపరిశోధకుల బృందం  వారిని వ‌రుస‌గా ఎనిమిది రోజుల పాటు వారి నుంచి  సమాచారాన్ని సేకరించారు. వారి  అనుభ‌వాలపై, ఫీలింగ్స్‌ పై  జరిపిన ఇంట‌ర్వ్యూల డాటా ఆధారంగా జ‌ర్న‌ల్ ఆఫ్ జెరెంటాల‌జీ లో ఈపరిశోధన వివరాలు  పబ్లిష్ చేసారు.

read more:  husband wife: భార్యాభర్తల మధ్య గొడవల వలన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం  కలుగుతుందో తెలుసుకోండి!!(పార్ట్2)

ఈ పరిశోధనలో భాగంగా ఎక్కువగా వాదించుకోవడం, వాదనలను తప్పించుకోవడానికి లేదా ఆపేయడానికి  ప్రయత్నం చేసేవారిని  గమనించి వాటి నుండి  వచ్చే ఫ‌లితాల‌ను విశ‌దీక‌రించారు. ‌ఈ అధ్యయనంలో తెలుసుకున్న  విషయాల ఆధారంగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే  వాద‌ప్ర‌తివాద‌న‌లు లేకుండా  సమస్యను ప‌రిష్క‌రించుకోవ‌డం చాలామంచిది. దీని వ‌ల్ల ఆ జరిగిన వాదనలో  మీరు ఒప్పుకోని విష‌యాల‌కు సంబంధించిన‌ ఎమోష‌నల్, ప్ర‌తిస్పంద‌న‌ల భారం మీ  మీద త‌గ్గుతుందని పరిశోధకులు తెలియచేస్తున్నారు.ఒక రోజు వ్య‌వ‌ధిలో వాదించుకున్న వారిని పరిశీలనలోకి  తీసుకున్నప్పుడు, వాద‌న‌ను కొన‌సాగించిన రోజుకి  వాద‌న‌ను త‌ప్పించుకున్న రోజుకు మధ్య  ఉన్న తేడా తెలిసింది.

read more:  husband wife: భార్యాభర్తల మధ్య గొడవల వలన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం  కలుగుతుందో తెలుసుకోండి!!(పార్ట్2)

వాద‌న జ‌రిగిన రోజున సమస్య ప‌రిష్క‌రించుకున్న‌వారి తో పోల్చి చుస్తే సమస్యని  ప‌రిష్క‌రించుకోని వారిలో కంటే స‌గం మానసిక భారం త‌గ్గిన‌ట్లు తెలుస్తుంది. ప్ర‌తి ఒక్క‌రు త‌మ జీవితంలో ఎంతో కొంత ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. అస‌లు ఒత్తిడి లేకుండాచేసుకోవడం అనేది  ఎవ‌రికీ సాధ్యం కానిది. అయితే ఏ స్థాయి వ‌ర‌కూ ఈ ఒత్తిడిని మ‌న‌తో పాటు ఉంచుకుంటామ‌నేది ఇక్క‌డముఖ్యమైన  విష‌యం.


Share

Related posts

ఈ టైమ్ లో మీకు విటమిన్ డీ అనేది కంపల్సరీ పడాలి .. మిస్ అవ్వకండి

Kumar

Asmita sood random clicks

Gallery Desk

వైయస్ జగన్ టోటల్ రాంగ్ స్ట్రాటజీ ! అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నావు గురూ!

Yandamuri