Diabetes: మీకు షుగర్ వ్యాధి ఉందా..? చలికాలం వీటికి దూరంగా ఉండాలి..!!

Share

Diabetes: మధుమేహం (షుగర్ వ్యాధి)తో చాలా మంది బాధపడుతుంటారు. పెద్ద వయస్సు వాళ్లలో దాదాపు 80 శాతం మంది షుగర్ వ్యాధి గ్రస్తులే ఉంటారు. వైద్యుల సూచనల మేరకు ఆహార నియమాలు పాటిస్తూ మందులు వాడితే ఇది ప్రాణాంతకమైనది ఏమి కాదు. కానీ షుగర్ వ్యాధి వచ్చింది అంటే ఇక జీవిత కాలం అప్రమత్తంగా ఉండాల్సిందే. క్రమం తప్పకుండా మందులు వాడుతుండాల్సిందే. ఆహార నియమాలు పాటించాల్సిందే. ఎందుకంటే డయాబెటిస్ కారణంగా మన రక్తంలో చక్కెర స్థాయిలు నిరంతరం మారుతూ ఉంటాయి. రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చు తగ్గులు మీకు హనికరమే. చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి రక్తంలో షుగర్ లెవల్స్ పై ప్రత్యక్ష ప్రభావం చూపే పదార్ధాలను మనకు తెలియకుండానే తీసుకోవడం జరుగుతుంటుంది. సాధారణంగా ఈ రోజుల్లో చాలా మంది అన్నం తినడం మానేస్తారు. కానీ అన్నం మాత్రమే రక్తంలో చక్కెర స్థాయికి పెరగడం కారణం కాదు. చాలా ఆహార పదార్ధాలు రక్తంలో షుగర్ లెవల్స్ పెంచుతాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు చలికాలంలో తీసుకోకుడని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

health tips Diabetes
health tips Diabetes

Diabetes: అహారాన్ని తీసుకోవడం మానేయవద్దు

ఎటువంటి కారణం లేకుండా ఏదైనా ఆహారాన్ని తీసుకోవడం మానేయవద్దు. అలా చేయడం వల్ల మీరు శరీరానికి అవసరమైన పోషకాలను సరఫరా చేయడం ఆగిపోతుంది. బియ్యం, బంగాళదుంప, ఉప్పు, ఐస్ క్రీమ్, రసగుల్ల లాంటివి రక్తంలో షుగర్ లెవల్స్ పై ప్రభావం చూపిస్తాయి. షుగర్ కారణంగా తరచుగా మన బరువు కూడా తగ్గడం జరుగుతుంది. కాబట్టి బరువు తగ్గకుండా మీ వయస్సును బట్టి తగిన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రధానంగా షుగర్ వ్యాధి గ్రస్తులు వైద్యుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఏంతైనా ఉంటుంది.


Share

Related posts

ఏపీ రాజధానిపై స్టేటస్ కో అక్టోబర్ 5వరకు పొడిగింపు

Special Bureau

NIA: తెలంగాణలో ఎన్ఐఏ విస్తృత సోదాలు..! భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం..!!

somaraju sharma

Israel: మిడిల్ ఈస్ట్ లో సరికొత్త రాజకీయ వాతావరణం ..ఇజ్రాయెల్ కి దూరంగా అమెరికా..??

sekhar