ఈ రోజుల్లోచాల మందికి పొట్ట తగ్గడం, బరువు తగ్గడం అన్నవి పెద్ద సమస్యలుగా మారాయి.. ఫైబర్ తో పాటు కొన్ని ముఖ్యమైన పోషకాల తో ఉండే చెరుకు రసం తో చాల తేలికగా బరువు తగ్గవచ్చు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వును కరిగిస్తుంది. అంతేకాదు ఇందులోని పాలీఫెనోలిక్ కాంపౌండ్లు, ఫ్లైవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు శరీరం లో వ్యాధినిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా రక్షణ కల్పిస్తాయి.
కాబట్టి రోజు కు ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే ప్రోటీన్లు, పొటాషియం, ఫైబర్‌తోపాటు…కాల్షియం, జింక్, ఐరన్ అమైనా యాసిడ్లు శరీరంలో అధిక బరువును తగ్గిస్తాయి.కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనితో పాటు కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని చేరుకురసం తగ్గిస్తుంది.
కేలరీల విషయానికి వస్తే చెరుకు రసం లో తక్కువగా ఉంటాయి. 30 గ్రాములు పంచదార మాత్రమే ఉంటుంది. మన శరీరం లో అనవసరం గా ఉండే ట్రైగ్లిసెరైడ్స్ని LDL కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అసలు వీటి వల్లే మనం బరువు పెరుగుతూ ఉంటాం. ఇవి మన శరీరం లో పెరిగే కొద్దీ,గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి రోజూ గ్లాస్ చెరుకు రసం తాగితే, మన శరీరాన్ని అది ఆటోమేటిక్‌గా క్లీన్ చేసి వ్యర్థాల్ని బయటకు పంపేస్తుంది. ఇలా రెగ్యులర్‌గా జరిగే ప్రక్రియ వల్ల బరువు తగ్గుతారు . పొట్ట నడుము చుట్టూ ఉండే రింగు లాంటి కొవ్వు కూడా పోతుంది .చెరుకు రసం ముసలి తనం రాకుండా కూడా కాపాడుతుంది. మొటిమలు, మచ్చ లు రాకుండా చర్మాన్ని కాపాడుతుంది. ఎముకలు, దంతాలు కూడా దృఢం గా ఉంటాయి. కానీ చేరుకురసం రోజుకు ఒక గ్లాస్ మాత్రమే తాగాలి . తియ్య గా ఉంటుంది కదా అని గ్లాస్ లు గ్లాస్ లు తాగితే… అందులో ఉండే షుగర్ వల్ల… బరువు పెరిగే ప్రమాదం ఉంది .