NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

హైద్రాబాద్ నిండా పోలీసులే : జిహెచ్ఎంసి ఎన్నికలకు కనివిని ఎరుగని భద్రత

 

 

గతంలో ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క అన్నట్లుంది మహా హైద్రాబాద్ మున్సిపల్ ఎన్నికల పోరు. నిత్యం నేతల మాటల తూటాలతో వేడిక్కిన ఎన్నికల హోరు చివరి అంకంలో ఎలాంటి అల్లర్లు, గొడవలు, సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు హైద్రాబాద్ ను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు భద్రత పెంచారు. మొత్తం 46 వరకు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను, 60 వరకు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 70 శాతం పాతబస్తీలోవే. ఈ సారి బీజేపీ ఎన్నికల్లో యాక్టీవ్ రోల్ పోషిస్తుండటంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

మొత్తం 13 , 500 మంది…

* ఎన్నికల భద్రత కోసం 13,500 వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారు. హైద్రాబాద్ పోలీసులు 9 వేళ మందికి తోడు వివిధ జిల్లాల నుంచి అదనపు బలగాలు రానున్నాయి. 10,500 సివిల్, 3000 మంది ఏఆర్ (Armed Reserve) సిబ్బంది ఉంటారు.
* ఎన్నికల విధులకు సంబంధించి పోలీస్ సిబ్బందికి మూడు సార్లు తర్ఫీదు ఇచ్చారు. విడతల వారీగా వారికీ శిక్షణ పూర్తి చేసారు. అత్యవసరం వేళ ఇలా స్పందించాలి.. సున్నితమైన ప్రాంతాల్లో ఇలా నడుచుకోవాలి..? ఇలా విధుల్లో ముందుకు వెళ్లాలనే అంశాలను ఈ సరి పోలీసులకు ప్రత్యేకంగా ఇచ్చారు. హైద్రాబాద్ లాంటి నగరాల్లో ఏదైనా చిన్న గొడవ సైతం మొత్తం నగరమంతా నిమిషాల్లో పాకే అవకాశం ఉండటంతో దాని నిరోధానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసారు.
* ఎన్నికల రోజు సోషల్ మీడియా పుకార్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలపై ఒక కన్నేసి ఉంచేందుకు 25 మందితో కూడిన ఒక సాంకేతిక బృందాన్ని నియమించారు.
* నార్మల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఐ, సిఐ స్థాయి అధికారి, ఏసీపీ, ఏడీసీపీ, డీసీపీల నేతృత్వంలో భద్రత ఏర్పాటు చేసారు.
* 38 స్ట్రైకింగ్ ఫోర్స్, 11 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 9 సీపీ రిజర్వ్ టీమ్స్, 11 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 11 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ లు అందుబాటులో ఉంటాయి. ఏఏ ఫోర్స్ లకు ఎలాంటి విధులు.. ఇలా స్పందించాలి అనే విషయాలపై ఇప్పటికే వారికీ తగిన సూచనలు ఇచ్చారు.
* 73 హైపర్ సెన్సిటివ్ పికెట్ లు నియమించి కట్టుదిట్టమైన భద్రత పెంచారు. ఈ పికెట్ల వద్ద పోలీసులు చెప్పినట్లే నడుచుకోవాలి.
* హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద 1 ఎస్ ఐ, 4 ఏఆర్ సిబ్బంది ఉంటారు. వీరికి స్థానికులు సహకరించాలి.


* ఇక సైబరాబాద్ కమిషనరేట్ లో 38 వార్డ్ లు ఉన్నాయి. 2437 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.
ఇక్కడ 1421 నార్మల్ పోలింగ్ స్టేషన్ లు, 766 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి.
250 అత్యంత సమస్యాత్మక/ Hyper Sensitive పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి.
* సైబరాబాద్ పరిధిలో 177 మొబైల్ పార్టీలతో నిరంతరం మానిటరింగ్ చేస్తారు. సైబరాబాద్ లో 15 బార్డర్ చెక్ పోస్ట్ లు పెట్టారు. హైపర్ సెన్సిటివ్ ఏరియా ల్లో 73 పికెట్ లు ఉంటాయి.
* ఎప్పటి వరకు 587 లైసెన్సేడ్ గన్స్ డిపాజిట్ చేయించుకున్నారు. 369 మంది రౌడీ షీటర్ లను బైండోవర్ చేసుకున్నారు. రూ. 15 లక్షలు విలువ చేసే 396 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు.
* ప్రతి పోల్ల్లింగ్ స్టేషన్ కు జియో ట్యాగింగ్ చేసి , సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు . సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సిసిటివి లు ఏర్పాటు చేసి వాటిని ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారా అనుసంధానం చేసి నిత్యం నిఘా ఉంచుతారు.
లక్ష సీసీ కెమెరాలు ద్వారా సమస్యాత్మక ప్రాంతాలను మానిటరింగ్ చేయడం ఈ సరి ప్రత్యేకత.
* ఇక అధికారులు సైతం నిత్యం అందుబాటులో ఉంటారు. ఎవరికీ సెలవులు ఇవ్వకుండా అందరు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆర్డర్స్ వచ్చాయి. డిసిపి, ఏ సిపి ఆఫీస్ లో రౌండ్ ది క్లాక్ నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఎన్నికల అనంతరం లైవ్ స్ట్రీమింగ్ ద్వారా స్ట్రాంగ్ రూమ్ వద్ద నిఘా ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు.

author avatar
Special Bureau

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?