NewsOrbit
జాతీయం న్యూస్

బెంగళూరును అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. చెరువులను తలపిస్తున్న రహదారులు .. భారీగా ట్రాఫిక్ జామ్ ..ఇదిగో వీడియో

కర్ణాటక రాజధాని బెంగళూరు గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అవుతోంది. గత రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా బెంగళూరులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నీట మునిగాయి. రోడ్లు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని ముఖ్యమైన జంక్షన్ లలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కర్ణాటక రాష్ట్ర రాజధానిలో ఇంత తీవ్రమైన పరిస్థితి నెలకొనడం వారంలో ఇది రెండోసారి. గత రాత్రి కురిసిన వర్షానికి అపార్ట్‌మెంట్ ల గ్రౌండ్ ఫ్రోర్లు జలమయం అయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని, పిల్లలను పాఠశాలలకు పంపవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Bangalore heavy Rainfall

బాలికలపై అత్యాచారం కేసు.. నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి లింగాయత్ మఠాధిపతి శివమూర్తి

ఎకోస్పేస్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు, బెల్లందూరు, కేఆర్ మార్కెట్, సిల్క్ బోర్డు జంక్షన్, వర్తూరు తదితర ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఐటీ కారిడార్‌ కూడా నీటమునిగిపోగా, హెచ్‌బీఆర్‌ లేఅవుట్‌లోని పలు ఇళ్లు నీటమునిగాయి. పాత విమానాశ్రయ రోడ్డు మధ్యలో బస్సులు నిలిచిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత వారం కురిసిన వర్షాలకు కూడా రోడ్డు నీటమునిగాయి. సర్జాపూర్ రోడ్‌లో సమీపంలోని భవనాల పార్కింగ్ స్థలాలు నీటితో నిండిపోయాయి. వర్షపు నీటి కారణంగా కాలువలు పొంగి పొర్లడంతో వర్తూరులోని బలగెరె-పాణత్తూరు రహదారి నదిగా మారింది. మహదేవపురలో 30కి పైగా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, వాటి బేస్‌మెంట్లు జలమయమయ్యాయి.

Bangalore heavy Rainfall

బెంగళూరులో గత మంగళవారం కూడా భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. భారీ వర్షాల కారణంగా వందల కోట్ల నష్టం వాటిల్లిందని ఐటీ, బ్యాంకింగ్ సంస్థలు ముఖ్యమంత్రికి లేఖ రాశాయి. దీనిపై సీఎం బసవరాజు బొమ్మై .. తాను ఐటీ కంపెనీలను పిలిపించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తాననీ, వర్షం కారణంగా జరిగిన నష్టం తదితర అంశాలపై చర్చిస్తానని తెలిపారు.

మరో పక్క ఈ నెల 9వ తేదీ వరకూ కర్ణాటక అంతటా, ముఖ్యంగా బెంగళూరు, రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కొడగు, శివమొగ్గ, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపి, చిక్కమగళూరు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

కోనసీమ జిల్లాలో కాల్పుల కలకలం.. కాల్పులకు తెగబడింది వాళ్లేనా..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju