కోస్తాలో మూడు రోజులు వర్షాలు

విశాఖ:ఒడిషా దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల రాబోయే 24 గంటల్లో కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, రాబోయే మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చనీ వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.