హీరా గ్రూపు చైర్మన్ నౌహీరా షేక్ అరెస్టు

60 views

చిత్తూరు, జనవరి 3: హీరా గ్రూపు కుంభకోణం కేసులో నిందితురాలైన హీరా గ్రూపు అధినేత్రి నౌహీరా షేక్ ను గురువారం రాష్ర్ట సీఐడీ పోలసులు అదుపులోకి తీసుకుని చిత్తూరు కోర్టులో హాజరుపర్చారు. గొలుసు కట్టు వ్యాపారంలో నౌహీరా నిందితురాలిగా ఉన్నారు.

గొలుసుకట్టు వ్యాపారం పేరుతో దేశ వ్యాప్తంగా డిపాజిట్లు సేకరించి కోట్ల రూపాయలు  స్వాహా చేసినట్లు ఆమెపై ఆరోపణలు. ఫోలీసులు హీరా గ్రూపులో ఉగ్రవాదులకు సంబంధించిన డిపాజిట్లు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

హీరో గ్రూపు కుంభకోణం విలువ ఎనిమిది వేల కోట్లు మేర  ఉండవచ్చని పోలీసుల అంచనా. ఈ గ్రూపు ఫెమా నిబంధనలను ఉల్లంఘించి నిధులను అక్రమంగా తరలించినట్ల పోలీసులు వెల్లడించారు. విదేశీ బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. సీఐడీ పోలీసులు హీరా గ్రూపు కుంభకోణంపై  జాతీయ దర్యాప్తు సంస్థల సహకారం కోరారు.