height: ఎత్తు పెరగడానికి మంచి చిట్కాలు  ఇవే!!

Share

height:  మన ముందు తరాల వారు చాలా పొడవుగా ఉండేవారట … రాను రాను అది తగ్గిపోతూ వస్తుంది. ప్రస్తుత కాలంలో  అందరిలోనూ  ఎదుగుదల  చాలా తక్కువ శాతం  ఉంటోంది. ఈ పెరుగుదలకు వంశపారంపర్యం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. చిన్ననాటి నుండి సరియైన పోషకాహారం తీసుకోక పోయినా కూడా పెరుగుదల ఆగి పోయే ప్రమాదం ఉంది.

మనిషి ఎదుగుదలకు  సంబంధించిన హార్మోన్ ఎక్కువగా టీనేజ్ లో విడుదలవుతుంటాయి.  అందుకే టీనేజ్ లో ఉన్నప్పుడు, మంచి పౌష్టికాహారం తీసుకోవడం వలన చక్కని పెరుగుదల కనిపిస్తుంది. ఆ ఆహార పదార్థాలు  గురించి తెలుసుకుందాం.
మనం రోజువారీ తీసుకునే ఆహారంలో క్యారెట్,బచ్చలికూర, సోయాబీన్స్,బెండకాయ వంటివి చేర్చుకోవడం వల్ల ఎత్తు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఐరన్, ఫైబర్, కాల్షియం, ఉండటం వలన ఇది పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి.ఉసిరికాయను రోజు క్రమం తప్పకుండ తీసుకోవడం వల్ల ఎత్తు పెరగడానికి  ఉపయోగపడుతుంది . ఇందులో ఉన్న విటమిన్ సి, కాల్షియం,పాస్ఫరస్, మినరల్స్ మనిషి పొడవు అవడానికి ఉపయోగపడతాయి.

 


ఒక గ్లాసు పాలలో కొద్దిగా బెల్లం, అశ్వగంధ 5 మిరియాలు,పొడి కలిపి 3 నెలల పాటు క్రమం తప్పకుండా ప్రతి రోజు రాత్రిపూట తాగుతుంటే మంచి ప్రయోజనకారి గా పనిచేస్తుంది. ప్రతిరోజు టిఫిన్ తినే సమయంలో మెత్తగా ఉడకబెట్టిన గుమ్మడికాయ  గోరువెచ్చగా ఉన్నప్పుడు దానికి కొంచెం కొంచెం తేనెను,పటికబెల్లం పొడిని, కలిపి రెండు స్పూన్ల చొప్పున తింటూ ఉంటే అది పొడవును పెంచే టిష్యూలు నిర్మాణం చేయడానికి,కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.
పటిక బెల్లం,జీలకర్ర, ఎండిన అంజీర పండ్లు, తీసుకుని మెత్తని  పొడి  చేసుకుని దానిని సీసాలో  జాగ్రత్త చేసుకుని  ప్రతిరోజు గ్లాసు పాలలో ఒక స్పూన్ పొడి కలుపుకుని తాగడం వలన ఎత్తుగా బాగా పెరుగుతారు.

ప్రతిరోజు క్రమం తప్పకుండా స్కిప్పింగ్ ఆడటం,వ్యాయామం చేయటం, సైకిల్ తొక్కడం, వలన కూడా మంచి మార్పు కనిపిస్తుంది.అయితే చిన్నప్పటి నుండే ఎత్తు పెరగడం మీద ద్రుష్టి పెట్టి సరైన పోషకాహారం ఇవ్వడం వలన మంచి ప్రయోజనం ఉంది.అయితే వంశం లో పొట్టిగా ఉండే లక్షణం ఉండేవారికి మాత్రం పొట్టిగా ఉండడం గురించి చింత లేకుండా వారి ప్రవర్తన తీర్చి దిద్దాలి.


Share

Related posts

Ration Door Delivery : రేషన్ డోర్ డెలివరీని ఢిల్లీలో నిలిపేసిన కేంద్రం !ఏపీపై కూడా ఆ ఎఫెక్ట్ పడే అవకాశం?

Yandamuri

Daily Horoscope జూలై 27 సోమవారం మీ రాశి ఫలాలు

Sree matha

నీతి లేని న్యాయం..!! ఎవరి మరణం.? ఎక్కడి కేసు.? ఎందుకీ రాజకీయం.?

Special Bureau