Pregnancy: అవాంఛిత గర్భం రాకుండా కొన్ని సురక్షితమైన పద్ధతులు ఇవే !!(పార్ట్ -1)

Share

Pregnancy: వివాహమైన  జంట అప్పుడే  పిల్లలు వద్దనుకున్నప్పుడు లేదా బిడ్డకు బిడ్డకు గ్యాప్ కావాలన్నప్పుడు   జాగ్రత్త పడే   పద్ధతులు చాలానే ఉన్నాయి.  వాటిలో  ఎక్కువ మందికి తెలిసిన ఒక పద్ధతి కండోమ్  ని వాడటం.  అవాంఛిత గర్భం   రాకుండా మాత్రమే కాదు..   వివిధ రకాల శృంగారం తో వ్యాప్తి చెందే రకరకాల జబ్బులను అడ్డుకుంటుంది.    నిరోధ్ తో పాటు ఇంకా  ఎలాంటి  బర్త్ కంట్రోల్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయో  తెలుసుకుందాం.

వజైనల్ రింగ్ అనేది ఓ ఫ్లెక్సిబుల్ రింగ్ అనే చెప్పాలి. ఇది చాలా మెత్తగా  ఉంది వాడటం  కూడా చాలా తేలిక . దీని  తో  అవాంఛిత గర్భం రాకుండా చూసుకోవడం సులభం కూడా. ఇది     అండాలను గర్భాశయం వద్దకు చేరకుండా  చేస్తుంది . ఇది యోని భాగంలో అమర్చుకొని మూడు వారాల పాటు ఉండవచ్చు. ఈ మూడు వారాల పాటు అది బర్త్ కంట్రోల్ పద్ధతి పనిచేస్తుంది. మీ పీరియడ్స్  ముందు దీన్ని తీసేయాల్సి ఉంటుంది.  పీరియడ్స్ పూర్తి కాగానే దీన్ని తిరిగి  అమర్చుకోవచ్చు.

బర్త్ కంట్రోల్ పిల్స్ అవాంఛిత గర్భం రాకుండా చేసే ఈ తరహా పద్ధతి గురించి   చాలా మందికి తెలుసు అనే చెప్పాలి. అయితే వాటిని ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.మందులు రోజూ ఒకే సమయానికి వేసుకోవాల్సి ఉంటుంది. పీరియడ్ పూర్తయ్యాక ఆరో రోజు నుంచి మొదలు పెట్టె  ఈ మందులను ఇరవై ఒక్క రోజుల పాటు వేసుకొని ఆపేయడం వల్ల ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో అండం విడుదలను,ఫలదీకరణ ను   ఇది అడ్డుకుంటుంది.


Share

Related posts

షో లో వాళ్ళు చేసిన పనికి సిగ్గుతో తలదించుకున్న సుమ..!

arun kanna

పూరి జగన్నాధ్ పరిచయం చేస్తున్న ఆ ఇద్దరు హీరోయిన్స్ టాలీవుడ్ లో మంటలు పెడతారట..!

GRK

ప్రభాస్ ప్లాన్ అదిరిపోయింది…. ఆ టాలెంటెడ్ డైరెక్టర్ ఇక నుంచి యూవి లోనే సెటిలవుతున్నాడు ..?

GRK