NOVEMBER: నవంబర్ 1 అంటే ఇవాళ్టి నుంచి అమలవ్వబోతున్న కొత్త రూల్స్ తప్పకుండా తెలుసుకోవాల్సినవి..!

Share

NOVEMBER: మనదేశంలో ప్రతీనెలా 1వ తేదీన కొన్ని రంగాలు, ముఖ్యమైన విషయాలకు సంబంధించి రూల్స్ అనేవి మారుతుంటాయి. వీటి గురించి మనం తెలుసుకోకపోతే ముందు ముందు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే, ప్రతీనెల బ్యాంకింగ్(banking), సిలిండర్ ధరలను సమీక్షిస్తారన్న విషయం మీలో చాలా మందికి తెలియక పోవచ్చును.. అయితే, నవంబర్ 1 (November)తర్వాత ఏం మార్పులు జరగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Bank Holidays: నవంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా మీ కోసం…!

ఏయే రంగాల్లో మార్పులు..

ఇండియన్ రైల్వే నవంబర్ 1 నుంచి దేశంలోని పలు రైళ్ల టైమింగ్స్‌ను మార్చనుంది. అక్టోబర్ 1నుంచి కొత్త టైం టేబుల్ రావాల్సి ఉండగా, అనుకోని కారణాల వలన దానిని ఒక నెల వాయిదా వేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. 13వేళ ప్యాసింజర్ రైళ్లు, 7వేల గూడ్స్ రైళ్లు, 30 రాజధాని రైళ్ల టైమింగ్స్‌లో మార్పులు జరగనున్నాయి. ఇకపోతే ప్రతినెలా బ్యాంకింగ్ రంగంలో ఎన్ని సెలవులు వస్తాయనేది ముందుగానే ప్రకటిస్తారు. అయితే, నవంబర్ నెలలో 17రోజులు సెలవులు రానున్నాయి. ఇందులో 11 మాత్రం ఆర్బీఐ క్యాలెండర్ జాబితా ప్రకారం హాలీడేస్ అనగా వారాంతం, దేశవ్యాప్తంగా ఉండేసెలవులు… కాగా ఈసారి తెలుగు రాష్ట్రాల్లో 8రోజులు సెలవులు వచ్చాయి. అదే విధంగా ప్రతినెలా గ్యాస్ (gas) సిలిండర్ ధరలను సమీక్షిస్తారు. దీని ప్రకారం గ్యాస్ ధరలు పెరగచ్చు లేదా తగ్గొచ్చు.
అలాగే ఉండవచ్చు. కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ప్రతినెలా సమీక్ష ఉంటుందని, ఈనెల సిలిండర్ ధరలు పెరగవచ్చని వ్యాపారవేత్తలు చెబుతున్నారు.


నవంబర్ 29న అరుణాచలంలో కార్తీకదీపోత్సవం !

వాట్సాప్, బ్యాంకింగ్ అప్ డేట్స్..

సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఆండ్రాయిడ్(what’s up), ఐఓఎస్ వంటి పాత వెర్షన్‌లలో పనిచేయదని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ యాప్ ఆండ్రాయిడ్ ఓఎస్ 4.1, ఐఓఎస్ 10 అంతకంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్న వాటిలో మాత్రమే పనిచేస్తుంది. ఇకపోతే పెన్షనర్లకు SBI పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. తాము బతికే ఉన్నామని ధృవపత్రాలు అందజేయడానికి బ్యాంక్ దాక వెళ్లాల్సిన పనిలేకుండా వీడియో కాల్ ఆప్షన్ ప్రొవైడ్ చేసింది. కాల్ ద్వారా చూపిస్తే చాలు. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా తమ సర్వీస్ చార్జీల నిబంధనలను మార్చింది.


November: మీరు నవంబర్ లో పుట్టారా?అయితే ఇది మీకోసమే!!
నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ లావాదేవీలు డిపాజిట్లు, విత్ డ్రాలు చేస్తే రూ.40 చార్జి విధిస్తారు. కరెంట్ అకౌంట్‌కు మాత్రం 150 చెల్లించాల్సి ఉంటుంది. జన్ ధన్ బ్యాంకులో డబ్బు డిపాజిట్ కు ఎటువంటి చార్జి ఉండదు.. కానీ పరిమితి దాటి డబ్బులు తీస్తే రూ.100 చార్జి వసూలు చేయనున్నారు.


Share

Related posts

టీడీపీ ఎమ్మెల్యే రూ. 300 కోట్ల భూ స్కామ్..!! వైసీపీలోకి ఎంట్రీ లేనట్టే..!?

Srinivas Manem

Rakul Preet Singh Latest pics

Gallery Desk

లాస్ట్ ఆఫ్షన్: జగన్ ముందు “నైతికత” ప్రస్థావన!

CMR