Sleep: ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యం. కంటికి సరిపడా నిద్ర లేకపోతే ఆరోగ్యానికి మంచిది కాదు. మన శరీరం అలసటకు గురి అయినప్పుడు నిద్ర పోతే కాస్త ఉపశమనం లభిస్తుంది. చాలా మంది రాత్రి పూట నిద్ర మంచిది, మధ్యాహ్నం పూట నిద్ర మంచిది కాదనే అపోహలో ఉంటారు. కానీ మధ్యాహ్నం(afternoon) పూట కూడా ఒక గంట పాటు నిద్రపోతే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నరు.
Sleep: బాగా నిద్ర పట్టడానికి ,మలబద్ధకం తగ్గడానికి ఇది తాగి చూడండి!!
మధ్యానపు నిద్ర వలన కలిగే ఉపయోగాలు :
పొద్దున లేచిన దగ్గర నుండి పని చేసి అలిసిపోయిన శరీరానికి మధ్యాహ్నం పూట ఒక గంట సేపు పడుకుంటే ఒత్తిడి తగ్గడంతో పాటు మెదుడు కూడా చురుగ్గా పని చేస్తుంది. బాగా ఒత్తిడికి లోనయినవారు మధ్యాహ్నం పడుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం అరుగుదల అవ్వాలన్న గాని మధ్యాహ్నం పూట నిద్ర సహాయపడుతుంది. మధ్యాహ్న నిద్ర (sleep) వలన బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉండడంతో పాటు గుండే మీద ఒత్తిడి తగ్గి గుండె పనితీరు కూడా మెరుగు పడుతుంది. మధ్యాహ్నం ఒక గంటన్నర సేపు నిద్రిస్తే నరాల కదలిక బాగా ఉంటుందట.
Sleep: మంచి నిద్ర కావాలంటే ఇలా ప్రయత్నించి చూడండి !!
మధ్యాహ్నం పూట నిద్రపోతే బరువు పెరుగుతారా..?
చాలామంది మధ్యాహ్నం పూట నిద్రపోతే బరువు పెరుగుతారు అనే అపోహలో ఉంటారు. నిజానికి మధ్యాహ్నం పూట నిద్ర పోవడం వలన బరువు పెరగరు. సగటున ప్రతి మనిషికి 5-7 గంటల పాటు నిద్ర అనేది చాలా ముఖ్యం. అలాగే రోజు వ్యవధిలో 5 గంటల కంటే తక్కువ పడుకున్నా, 9 గంటల కంటే ఎక్కువ సేపు పడుకున్నా గాని త్వరగా బరువు పెరుగుతారని తాజా అధ్యయనాలు తెలిపాయి. మధ్యాహ్నం పూట ఒక గంట, రెండు గంటలు పడుకుంటే ఎక్కువ సమయం పని చేయడానికి వీలుంటుంది.
Sleep: నిద్ర పోయేటప్పుడు నోరు తెరచుకుంటుందా ?మూత పడుతుందా? దానివల్ల జరిగేది ఇదే!!
మధ్యానపు నిద్ర గురించి రీసెర్చ్ లో ఏమి తెలిసిందంటే..
మధ్యాహ్నం నిద్రపోయే సైనికులపై ఒక టీమ్ రీసెర్చ్(research) చేయగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయ ఈ పరిశోధనల్లో బాగంగా ఆమెరికా సైనికులపై డాక్టర్లు అధ్యయనం చేయగా మధ్యాహ్నం నిద్రకు అలవాటైన వారిలో కదలికలు ఎక్కువగా ఉన్నాయట. అదే నిద్ర అలవాటు లేని సైనికుల కదలికలు తక్కువగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది.