PPF: PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) సుకన్య సమృద్ధి యోజన వంటి ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ పథకాల గురించి చాలా మందికి తెలుసు. ఇవి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అలాగే వీటిల్లో డబ్బులు పెట్టడం ద్వారా ఆకర్షణీయ రాబడి మనం సొంతం చేసుకోవచ్చు. అందుకే చాలా మంది వీటిల్లో ఇన్వెస్ట్ చేయాలని భవిస్తూ వుంటారు. పోస్టాఫీస్ లోనే ఈ PPF, సుకన్య సమృద్ధి అకౌంట్లను ఓపెన్ చేసుకొనే వెసులుబాటు కలదు. అంతేకాకుండా వీటిల్లో ఆన్లైన్ ద్వారానే డబ్బులు డిపాజిట్ చేసుకుంటూ రావొచ్చు. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.
ఈ యాప్స్ ద్వారా కూడా మీరు డబ్బులు చెల్లించవచ్చు!
ఇకపోతే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా డక్పే డిజిటల్ పేమెంట్స్ యాప్ను లాంచ్ చేసింది. దీని ద్వారా PPF, సుకన్య సమృద్ధి స్కీమ్ వంటి వాటిల్లో ఆన్లైన్లోనే డబ్బులు డిపాజిట్ చేసుకొనే వెసులుబాటు కలదు.
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో సన్నీ.. దిశా దశ మార్చిన సంఘటన..!!
ఇపుడు మనం సుకన్య సమృద్ధి అకౌంట్లో డబ్బులు ఎలా డిపాజిట్ చేయాలో తెలుసుకుందాం.!
1. మొదట మన బ్యాంక్ అకౌంట్ నుంచి IPPB అకౌంట్కు డబ్బులు యాడ్ చేసుకోవాలి.
2. తరువాత DOP ప్రొడక్ట్స్లోకి వెళ్లి సుకన్య సమృద్ధి అకౌంట్ ఎంచుకోవాలి.
3. ఆ తరువాత మన అకౌంట్ నెంబర్, DOP కస్టమర్ ఐడీ ఎంటర్ చేయాలి.
4. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ డ్యూరేషన్, అమౌంట్ ఎంటర్ చేయాలి.
5. పేమెంట్ సక్సెస్ నోటిఫికేషన్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. వచ్చినట్లైతే డబ్బులు నేరుగా సుకన్య సమృద్ధి అకౌంట్లోకి వెళ్లిపోతాయి.
ఇపుడు PPF ఖాతాలోకి డబ్బులు పంపించడం చూడండి..
1. మొదట మన బ్యాంక్ అకౌంట్ నుంచి IPPB అకౌంట్లోకి డబ్బులు యాడ్ చేసుకోవాలి.
2. తరువాత DOP సర్వీసులలోకి వెళ్లాలి.
3. ఇక్కడ మీకు పలు ప్రొడక్టులు కనిపిస్తాయి. అందులో PPF అకౌంట్ ఎంచుకోవాలి.
4. తరువాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ DOP కస్టమర్ ఐడీ ఎంటర్ చేయాలి.
5. ఆ తరువాత మనం ఎంత మొత్తం డిపాజిట్ చేయాలనుకుంటామో ఎంటర్ చేయాలి. తరువాత పే ఆప్షన్పై క్లిక్ చేయాలి.
6. ఇప్పుడు మీ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినట్లు మీకు నోటిఫికేషన్ వస్తుంది. డబ్బులు నేరుగా PPF ఖాతాలోకి వెళ్లిపోతాయి.
ఈ విధంగా మనం అతి సులభంగానే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు.