Samantha: సమంత.. తెలుగు చిత్ర పరిశ్రమలో సమంతది ఓ సుస్థిర స్థానం. ఎన్నో ఒడిదుడుకుల మధ్యన కూడా ఆమె ధైర్యంగా ముందుకు సాగిపోతోంది. ఓ సాధారణ సినిమాలు చేసే స్థాయినుండి పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి వెళ్లిన సామ్ ని మనం పొగడకుండా ఉండలేం. విడాకుల అనంతరం, సామ్ తన కెరీర్ పరంగా ప్రణాళికల్ని రచిస్తూ పని ఒత్తిళ్లను మ్యానేజ్ చేసేందుకు తన పెంపుడు పప్పీస్ తో ఆటలాడుకుంటూ మూగజీవాలతో సాన్నిహిత్యం పెంచుకుంటూ ఒత్తిడిని జయిస్తోంది.
Samantha: `ఆర్ఆర్ఆర్` బ్యూటీపై సమంత స్టోరీ.. మాటలు సరిపోవడం లేదట!
Samantha: సామ్ ఇష్టమైన నేస్తాలు ఇవే:
సామ్ దగ్గర వున్న పెంపుడు కుక్కలు (హాష్, సాషా) గురించి అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు వాటి ఫోటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తుంటుంది. చైతన్యను పెళ్లి చేసుకోక ముందు నుంచి ఉన్న హాష్ అంటే సమంతకు ప్రాణం. హాష్ తో పాటు సాషా కూడా ఎప్పుడూ సామ్ వెంటే ఉండి సందడి చేస్తూ ఉంటాయి. సామ్ నిరంతరం వాటిని ముద్దు చేస్తూ పెంచుకుంటోంది. సమంతా తన పెంపుడు జంతువులైన సాషా – హష్ లతో సమయం గడుపుతున్నందున తాను మార్నింగ్ పర్సనాలిటీ అని చెప్పకనే చెప్పింది.
Samantha: సమంత భావోద్వేగం.. ఈ రోజు ఆమెకెంత స్పెషలో తెలుసా?
సామ్ తాజా పోస్ట్:
సమంత తన ఇద్దరు స్నేహితులైనటువంటి హష్ – సాషాతో కలిసి తీసుకున్న ఓ ఎమోషనల్ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. అందులో తన పెంపుడు జంతువులు రెండూ సామ్ ఒడిలో కొలువుదీరాయి. సామ్ ఈ పోస్ట్ కి అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చింది. అదేమంటే, హాష్ ఫ్రెంచ్ బుల్ డాగ్ అయితే.. సాషా ఒక పిట్-బుల్. ఈ అందమైన కిడ్స్ తో కలిసి సమంత తరచూ క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఆమధ్య జిమ్ లో వ్యాయామం చేస్తుండగా అవి సామ్ ని డిస్టర్బ్ చేసిన వీడియో ఒకటి షేర్ చేసిన విషయం తెలిసినదే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?