Samantha: ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో దుమ్ము దులుపుతున్న టాప్ హీరోయిన్లలో సమంత పేరు ముందుంటుంది. తొలి సినిమా ఏమాయ చేసావే సినిమాతోనే టాలీవుడ్లో జండా పాతేసింది. ఓ వైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లు అంటూ తెగ బిజీగా ఉంటుంది. ఓటీటీలో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్లో రాజీ పాత్రలో నటించి మెప్పించింది. ఇక విడాకుల అనంతరం సమంత సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా గడుపుతోంది. నిత్యం ఏదో ఓక విషయం అందులో షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే స్వీట్జర్లాండ్ ట్రీప్ కి సంబంధించిన ఫోటోలను తాజాగా షేర్ చేసింది.
Today Horoscope: ఫిబ్రవరి 6 – పుష్యమాసం – రోజు వారీ రాశి ఫలాలు
Samantha: ఆ పిల్ల పెద్దయ్యాక సమంతలా అవుతుందట!
ఇక సమంతకు తెలుగునాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులు మన సామ్ ని ఇష్టపడతారు. అందులో చిన్నపిల్లలు కూడా వున్నారు. తాజాగా ఓ పాపను పెద్దయ్యాక ఏమవుతావు అని అడగ్గా.. ‘సమంత’ అవుతానని చెప్పిందంట. సదరు వీడియోను కీర్తి సురేష్ తన ఇన్ స్టాలో షేర్ చేయడం కొసమెరుపు. వివరాల్లోకి వెళితే, కీర్తి తన సినిమా షూటింగ్ సెట్ లో ఉన్న చిన్నారితో మాటలు కలిపి, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? అని అడిగిందట! దానికి ఆ చిన్నపిల్ల తడుముకోకుండా ‘సమంత అవుతాను’ అని సమాధానం చెప్పిందట.
YS Jagan: దటీజ్ జగన్ అనిపించుకున్నారుగా..? టీ కప్పులో తుఫానులా ఉద్యోగుల ఆందోళన..!!
సమంతకు కీర్తి సురేష్ అభ్యర్ధన ఇదే..
అక్కడితో ఆగకుండా ఆ చిన్నారి సమంతకు వీరాభిమనిని అని చెప్పిందట. దాంతో మంచి మనసు కలిగిన మన కీర్తి సదరు వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ “సమంత! ఈమె మీకు వీరాభిమాని.. మీరు ఆమెను తప్పకుండా ఒకసారి కలుసుకోవాలి!” అని అభ్యర్దించిందట. ఇక ఆ వీడియోకు సమంత రిప్లై ఇస్తూ.. ఎవరు ఈ క్యూటీ? అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కావాలంటే మీరూ చూడండి!