(పార్ట్-2) నారా హెరిటేజ్ X జగన్ అమూల్..! అమూల్ కి అంత ఈజీ కాదు..!!

ఏపీకి అమూల్ వస్తుంది. ఎందుకు..? ఎలా..? దీని వెనుక సీఎం జగన్ ద్వివ్యూహం ఏమిటి అనేది నిన్నటి కథనంలో చెప్పుకున్నాం కదా..! దానికి కొనసాగింపుగా అమూల్ ఆంధ్రాలో నెగ్గుకురావడం సులువా..? కాదా..? ఇక్కడ ఎదురైయ్యే సవాళ్లు ఏమిటి..? ప్రభుత్వ సహకారం ఎలా ఉండాలి..? అనే అంశాలను క్షుణ్ణంగా చెప్పుకుందాం..!!

అంత సులువు కాదు..! ఎందుకంటే..!!

అమూల్ ఏపీలో నెట్టుకురావడం, నెగ్గుకురావడం అంత ఈజీ మాత్రం కాదు. అలా అని ప్రభుత్వ సహకారం, పటిష్ట ప్రణాళిక ఉంటె కష్టమూ కాదు..!! ఇప్పటికే అమూల్ బ్రాండ్ దక్షిణ భారతదేశంలో ఫెయిల్ అయింది. మన పక్కనే తెలంగాణాలో అమూల్ కొన్ని డైరీలను తీసుకుని నడిపినా అంతగా విజయం సాధించలేదు. ఫ్రాంచైసీల పేరిట రిటైల్ ప్రయోగం కూడా చేసినా ఆశించినంత అందుకోలేదు. ఇక్కడ ఉన్న ప్రత్యేక ముద్ర పోగొట్టుకుని, అమూల్ ఏపీలో పాతుకుపోవాల్సి ఉంది.

read also>>నారా హెరిటేజ్ X జగన్ అమూల్..! క్షీర కార్యమా..? కక్ష కార్యమా..!? (పార్ట్ 1)

ఏపీలో సగటు నివాసితుడికి పాల పాకెట్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు విజయ, తిరుమల, హెరిటేజ్, మోడల్, దొడ్ల, సంగం, విశాఖ.., తదితరాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాలు, జిల్లాల వారీగా కొన్ని బ్రాండ్లు అలా పాతుకుపోయాయి. ఏపీలో సుమారుగా రోజుకి 45 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి జరుగుతుంది. సీజన్ బట్టి ఇది పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. దీనిలో సుమారుగా 70 శాతం వరకు వాటా ఆయా ప్రాంతాల్లోని ప్రైవేట్ డైరీలకు చేరుతుంది. పేరుమోసిన పెద్ద డైరీలు సహా, చిన్నచితక స్థానిక డైరీలకు చేరుతున్నాయి.

హెరిటేజ్ కి మొత్తం మీద రోజుకి 19 లక్షల లీటర్లు పాల సేకరణ ఉండగా, ఏపీలో రోజుకి 12 నుండి 14 లక్షల లీటర్ల సేకరణ ఉంది. దొడ్ల డెయిరీకి సుమారుగా 6, జెర్సీ డెయిరీకి 4 ., విశాఖ 3 లక్షల లీటర్లు, మోడల్ 2 , సంగం 2 లక్షల లీటర్లు వెళ్తుంటాయి. కొన్ని పాలను నేరుగా రైతులే ఇళ్లకు తీసుకెళ్ళు అమ్ముకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో ఉత్పత్తి అవుతున్న పాలను కొన్ని డైరీలు తమ గుప్పిట్లో పెట్టేసుకున్నాయి. మరి ఇక్కడ అమూల్ కి చోటు ఎక్కడ ఉంది..? అమూల్ వంటి కార్పొరేట్ దిగ్గజం ఏపీలో తమ లావాదేవీలు నడిపించాలి అంటే కనీసం రోజుకి 10 లక్షల లీటర్లు రావాల్సిందే కదా..!?

read also>>నారా హెరిటేజ్ X జగన్ అమూల్..! క్షీర కార్యమా..? కక్ష కార్యమా..!? (పార్ట్ 1)

ys jagan targets heritage and co total focus
ys jagan targets heritage and co total focus

అమూల్ నెగ్గాలంటే పక్క రాష్ట్రాల మాదిరిగా..!!

ఒక్కసారి కర్ణాటక వెళ్లి వద్దాం..!! అక్కడ కెఎంఎఫ్ (కర్ణాటక మిల్క్ ఫెడరేషన్) నందిని మిల్క్ బ్రాండ్ పేరిట హవా చాటుతుంది. కర్ణాటక సహా ముంబై, గోవా, కేరళ, ఏపీలో కొన్ని చోట్ల కూడా ఈ పాలు విస్తృతంగా అమ్మకాలున్నాయి. రోజుకి సగటున 60 లక్షల లీటర్ల మేరకు పాలను సేకరించి, వివిధ ఉత్పత్తులు ద్వారా వినియోగదారులకు చేరుస్తుంది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా 17 ఫెడరేషన్లు దీనిలో భాగంగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ప్రైవేట్ డైరీలు దరిదాపులకు కూడా వెళ్లలేకపోతున్నాయి. ఏదో అరకొర వ్యాపారాలతో సరిపెట్టుకుంటున్నాయి.
* తమిళనాడులోనూ (తమిళనాడు కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) పేరిట డైరీ ఉంది. ఆవిన్ మిల్క్ పేరుతో అమ్మకాలు జరుగుతాయి. ఆ రాష్ట్ర పాల వాటాల్లో దీనికి సగభాగం వాటా ఉంటుంది. ఇక మిగిలిన సగం హాట్సాన్, స్కంధన్, ఆనంద్ తదితర కంపెనీలున్నాయి. ఎన్ని ఉన్నా ప్రభుత్వ పరమైన వాటా మాత్రం సగం ఉంటుంది.

read also>>నారా హెరిటేజ్ X జగన్ అమూల్..! క్షీర కార్యమా..? కక్ష కార్యమా..!? (పార్ట్ 1)

ఏపీలో ఎలా చేయాలి..? జగన్ హామీలు ఎలా ఉన్నాయంటే..!!?

అమూల్ బ్రాండ్ మంచిదే. ఇండియాలోనే కాదు.., ఒకరకంగా ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉంది. రోజుకి 33 లక్షల లీటర్ల సేకరణ జరుగుతుంది. ఏపీలో కనీసం రోజుకి 15 నుండి 20 లక్షల లీటర్లు అమూల్ సేకరించగలితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఆ తర్వాత ఏపి పాల ఉత్పత్తిలో సగం సేకరించే లక్ష్యం పెట్టుకోవాలి.
* మొదటి లక్ష్యం రైతుల్లో నమ్మకం గెలుచుకోవడమే కావాలి. అంటే రైతులకు పాలుపోసిన మూడు, నాలుగు రోజుల్లోనే నగదు ఇచ్చేయడం.., బోనస్ ఇవ్వడం.., వెన్న శాతం లెక్కల్లో సరిగా ఉంటూ రైతులకు సానుకూలంగా నడుచుకోవడం.
* గ్రామస్థాయిలో సిబ్బంది నియామకంలో ఆచితూచి వ్యవహరించాలి. గ్రామస్థాయిలో సెంటిమెంట్లు, నాయకత్వాలు బాగా ప్రభావం చూపుతాయి. అందుకే పాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండే గ్రామాల్లోకి నేరుగా వెళ్లి సభలు నిర్వహించి.., స్థానిక పెద్దల ద్వారా రైతులతో మమేకం కావాలి.
* మరోవైపు సీఎం జగన్ హామీ మేరకు లీటర్ కి రూ. 4 అదనంగా ఇవ్వనున్నారు, దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి.., ప్రతీజిల్లాలోనూ చతికిలబడింది పాల సహకార సంఘాలను మళ్ళీ గాడిలో పెట్టాల్సి ఉంది. ఇదే ఇప్పుడు అమూల్ కి అతిపెద్ద లక్ష్యం కావాలి..!!

read also>>నారా హెరిటేజ్ X జగన్ అమూల్..! క్షీర కార్యమా..? కక్ష కార్యమా..!? (పార్ట్ 1)

chandrababu steps against cm jagan at delhi
chandrababu steps against cm jagan at delhi

ఇప్పటి వరకు ఏపీలో అమూల్ ప్రవేశిస్తే ఎదురైయ్యే సవాళ్లు చెప్పుకున్నాం..! అమూల్ కి ఇస్తే మంచిదే. కానీ టీడీపీ హయాం నుండీ ఈ పాల సేకరణ, సరఫరా విషయంలో ప్రభుత్వం చేస్తున్న అతి పెద్ద తప్పిదం రేపు చెప్పుకుందాం. ఆ తప్పిదం వెనుక ఉన్న కుంభకోణమూ విప్పుదాం..! రాష్ట్రంలో అతి పెద్ద పంపిణీ బాధ్యతని అమూల్ నెరవేర్చాల్సిన ఆవశ్యకతని ఆ కథనంలో వివరిద్దాం..!!