Gopichand: గోపీచంద్ 12 సంవత్సరాల నుండి చేస్తున్న ఒక గొప్ప పని..!!

Share

Gopichand: ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాటి గురించి తమ సినిమా వేడుకలలో అదే రీతిలో రిలీజ్ కార్యక్రమాలలో చెబుతూ ఎవరికి వారు గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే రీతిలో సదరు హీరో కి సంబంధించిన ఫ్రెండ్స్ , సన్నిహితులు ఇంకా చాలామంది సెలబ్రిటీలు… ఎవరికి వారు సమాజానికి తాము చేసే కార్యక్రమాలు గురించి ట్విట్టర్ లో  ఇంకా అనేక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో చెబుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో హీరో గోపీచంద్ మాత్రం దాదాపు 12 సంవత్సరాల నుండి ఒక గొప్ప పని చేస్తూ ఉన్నారు.

Gopichand slashes down his remuneration - Telugu Journalist | DailyHunt

మేటర్ లోకి వెళ్తే చెన్నైలో ఒక ఆర్ఫన్ స్కూల్ లో విద్యార్థులకు ఉచితంగా దాదాపు 12 సంవత్సరాల నుండి గోపీచంద్ విద్యను అందిస్తూ ఉన్నారట. ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎప్పుడూ కూడా తన సినిమాలకు సంబంధించిన అనేక ఇంటర్వ్యూల్లో గాని బయట పెట్టలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపడింది. ఈ క్రమంలో ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఎందుకు ఈ విషయం బయట పెట్టుకోలేదు, అని గోపీచంద్ అని ప్రశ్నించగా చేసే మంచి పని చేసుకుంటూ పోతే బెటర్ కానీ.. చెప్పుకోవటం వల్ల ఏంటి ఉపయోగం అన్న తరహాలో గోపీచంద్ అదిరిపోయే సమాధానం ఇవ్వడం జరిగింది.

Read More: Tollywood: సౌత్ ఇండియా బిగ్ డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇచ్చిన మహేష్ బాబు..?? 

ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో నిజంగా గొప్ప మనసున్న హీరో గోపీచంద్… హృదయపూర్వకంగా ఇతరులకు మంచి పని చేస్తున్నాడు.. హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ మొదటిలో సక్సెస్ రాకపోవటంతో… విలన్ పాత్రలు చేస్తూ మెప్పించడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ హీరోగా పాత్రలు చేస్తూ సక్సెస్ సాధించి ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరో గా కొనసాగుతున్నారు. చాలా సైలెంట్.. పెద్దగా హడావిడి చేయని గోపీచంద్.. దాదాపు 12 సంవత్సరాల పాటు ఇంత మంచి పని చేస్తూ ఉండటంతో.. తాజాగా ఈ విషయం బయటపడటంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.


Share

Related posts

విజయసాయి రెడ్డి తొందర పడ్డారా?? : విశాఖ వాసుల్లో ఆందోళన

Special Bureau

అందంగా అవ్వాలంటే ఇవి పాటించండి!

Teja

Dhivya dhuraisamy fabulous pics

Gallery Desk