Hero Movie Review: హీరో రివ్యూ

Share

Hero Movie Review: గల్లా అశోక్ కథానాయకుడిగా అరంగేట్రం చేసిన ‘హీరో’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. గల్లా పద్మావతి నిర్మాతగా అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం…

కథ

హీరో అశోక్ సినిమాల్లో కథానాయకుడిగా ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతను ఉండే అపార్ట్మెంట్ లో కొత్తగా వచ్చిన నిధి అగర్వాల్ తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమాయణం సాఫీగా జరుగుతూ ఉంటుంది. అయితే నిధి అగర్వాల్ తండ్రి జగపతిబాబు ఆ అపార్ట్మెంట్ లోనికి వచ్చిన సమయంలోనే అశోక్ కు పొరపాటున ముంబై లోని ఒక పెద్ద గ్యాంగ్ స్టార్ కు చెందిన తుపాకీ తప్పుడు కొరియర్ అడ్రస్ వలన లభిస్తుంది. ఆ తుపాకీ అసలు ఎవరి చేతికి వెళ్ళాలి..? దానితో జరగవలసిన పని ఏమిటి..? ఈ తుపాకీ వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులలో పడ్డాడు? చివరికి ఆ గ్యాంగ్స్టర్ పరిస్థితి ఏమైంది..? ఇదే మిగిలిన కథ..!

ప్లస్ పాయింట్స్

ఈ చిత్రంలో కామెడీ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. సీనియర్ నటుడు నరేష్, అతని కొడుకుగా నటించిన అశోక్ పండించిన ఫన్ చిత్రానికి హైలెట్.

నిధి అగర్వాల్ పాత్ర, ఆమె గ్లామర్ కూడా మరొక ప్లస్ పాయింట్. సంగీతం ఆకట్టుకుంటుంది.

అమర్ రాజా ఎంటర్టైన్మెంట్స్ వారు ఉత్తమ సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో అందంగా అత్యుత్తమంగా కనపడుతుంది.

మైనస్ పాయింట్స్

ఈ చిత్రంలోని కథ మరీ బలహీనంగా ఉంది. కథానాయకుడు అశోక్ గల్లా క్యారెక్టర్ రూపొందించడంలో కూడా పరిపూర్ణత లేదు.

ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు పూర్తిగా లోపించాయి. అసలు కొత్త హీరోలోని హీరోయిజం కోణం బయటపెట్టే అవకాశమే లేదు.

జగపతిబాబు క్యారెక్టర్ మినహాయించి ఏ ఒక్క పాత్ర గురించి కూడా ప్రేక్షకులకు పూర్తి అవగాహన ఉండదు. స్క్రీన్ ప్లే విషయంలో చేసిన ప్రయోగాలు దారుణంగా బెడిసికొట్టాయి.


విశ్లేషణ

కథ యొక్క అవసరానికి మించి బడ్జెట్ పెట్టిన ‘హీరో’ చిత్రంలో సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో పండలేదు. ఒక్క కామెడీ మినహాయించి చెప్పుకోదగిన ఎమోషన్ చిత్రంలో లేకపోవడం పెద్ద మైనస్. గల్లా అశోక్ పర్ఫార్మెన్స్ పర్వాలేదనిపించింది. పేరున్న ఆర్టిస్టులు చిత్రంలో ఉన్నప్పటికీ కథ ఎంతో బలహీనంగా ఉండటం… ఒక్కటంటే ఒక్క ఎలిమెంట్ కూడా చిత్రంలో లేకపోవడం గమనార్హం. చివరి 15 నిమిషాలలో చిత్రంలో బ్రహ్మాజీ తో పండించిన కామెడీ ఒకటే చెప్పుకోదగిన అంశం. సంక్రాంతికి థియేటర్లో చూడాల్సిన సినిమా కాకపోయినప్పటికీ ఓటిటిలో ఒక్కసారి టైంపాస్ గా చూసేయవచ్చు.

చివరి మాట: హీరోయిజం లేని ‘హీరో’ తో బోరో బోరు..!


Share

Related posts

కోవిడ్ పేషెంట్ల‌ను ప్రాణాపాయ స్థితి నుంచి త‌ప్పించే మెడిసిన్‌..!

Srikanth A

AP CM YS Jagan: ప్రధాని మోడీకి ఏపి సీఎం వైఎస్ జగన్ కీలక సూచన..! అది ఏమిటంటే..?

somaraju sharma

తేనె కల్తీని ఇలా గుర్తించండి !!

Kumar