Hero Nani: నానికి-థమన్ కి మధ్య ఏంజరిగింది? నటనకి సంగీతానికి వార్ తప్పదా?

Share

SS Thaman Nani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ ఎవరంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఒకే ఒక్కరు. అది నాని నే. అలాగే ప్రస్తుతం తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే.. అని అడిగినా ఠక్కున గుర్తొచ్చేది థమన్ పేరు మాత్రమే. దానికి నిదర్శనం ఇటీవల తానిచ్చిన టాప్ ఆల్బమ్స్. థమన్ గొప్పతనం ఏమంటే, సాంగ్స్ మాత్రమే కాకుండా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొడతాడు. ఇటీవల అఖండ మూవీ చుసిన ఎవరికైనా ఈ విషయం అర్ధం అవుతుంది. ప్రస్తుతం మ్యూజిక్‌ విషయంలో ఇతగాడు బాగా రాటుదేలాడు. ఇద్దరివీ వేరు వేరు దార్లు అయినప్పటికీ వారి వారి దార్లలో ఇద్దరూ తోపులే అని చెప్పుకోవాలి.

ఇంతకీ వీరిద్దరి మధ్య ఏం జరిగింది?

ప్రస్తుతం త‌మ‌న్‌కు, నానికి మ‌ధ్య ఎక్క‌డో చెడింద‌ని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి గతంలోకి ఓసారి తొంగి చూస్తే, ‘టక్ జగదీష్’ అనే సినిమాకు ముందు త‌మ‌న్‌ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. సాంగ్స్ మొత్తం ఆయనే చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో గాని త‌మ‌న్‌ ప్లేసులో గోపీసుంద‌ర్‌ లైన్ లోకి వచ్చాడు. నేపథ్య సంగీతంలో భాగంగా దర్శకుడు శివ నిర్వాణ రాసిన ఓ పాటను కూడా ఆయనే స్వరపరిచారు. అప్పుడే నాని, తమన్ మధ్య గొడవలు ఉన్నాయనే గుసగుసలు వినిపించాయి.

తాజాగా వీరి మధ్య జరిగిన ఓ సంఘటన పలు అనుమానాలకు దారితీస్తోంది.!

తాజాగా తమన్ చేసిన ట్వీట్స్, గతంలో నాని పలికిన మాటలకు కౌంటర్ అని నెటిజన్స్ భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ‘శ్యామ్ సింగ రాయ్’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని ఇలా అన్నారు. “సినిమాను సాంగ్ ఎలివేట్ చేసేలా ఉండాలి. కానీ డామినేట్ చేసేలా ఉండకూడదు.” అని నాని సదరు జర్నలిస్ట్ తో పలికిన మాటలకు తాజాగా థమన్ కౌంటర్ ఇచ్చారు. అదికూడా ట్వీట్ రూపంలోనే. “అన్ని శాఖలు మంచిగా పనిచేసినప్పుడే కంప్లీట్ ఫిల్మ్ తయారవుతుంది. ఎప్పుడూ ఒకరు డామినేట్ చేశారని అనకూడదు.. సినిమాను అర్థం చేసుకోవడానికి వారికి లోతైన అవగాహన అవసరం.” అని తమన్ ట్వీట్ చేశారు. ఇది నానిని ఉద్దేశించి చేసిన ట్వీట్ అని నెటిజన్స్ ఫీలింగ్. గతంలో ‘టక్ జగదీష్’ నుంచి తమన్ తప్పుకోవడంతో ఇప్పుడీ విశ్లేషణలు బయటకు పొక్కుతున్నాయి.


Share

Related posts

Big Breaking: టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ 

P Sekhar

బ్రేకింగ్ : పదివేలు రుణం ఇవ్వబోతున్న కేంద్రం !

siddhu

శివసేన ఇంకా ప్రభుత్వంలో ఎందుకు?

Siva Prasad