Nani: తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల మూతపడటం పై అదేరీతిలో టికెట్ల రేటు ప్రభుత్వ ఆధీనంలో ఉండే లా వార్తలు గత కొన్ని రోజుల నుండి వస్తున్న గాని ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ హీరో స్పందించలేదు. చాలావరకు సినిమా ఇండస్ట్రీని ప్రభుత్వాలు కంట్రోల్ చేసే రీతిలో ఉన్నట్లు వ్యవహారం నడుస్తున్న తరుణంలో న్యాచురల్ స్టార్ నాని చేసిన కామెంట్లు రాజకీయాలలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “తిమ్మరాసు” అనే కొత్త సినిమా ఫంక్షన్ కి వచ్చిన నాని థియేటర్లు మూతపడటం పై టికెట్ల వ్యవహారం పై కుండబద్ధలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కరోనా అదేరీతిలో ఇంకా కొన్ని సందర్భాలలో మొట్టమొదటిసారిగా థియేటర్లు మూసేస్తారు, అంతా సద్దుమణిగాక చివరాఖరిలో థియేటర్లు ఓపెన్ చేస్తారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
పబ్, రెస్టారెంట్లు ఓపెన్ అయినా గాని థియేటర్లకు పర్మిషన్ ఇచ్చే విషయంలో ప్రభుత్వాలు వెనకడుగు వేయటం దారుణమని అన్నారు. ప్రతి ఒక్కరికి సినిమా థియేటర్ అనేది రెండో ఇల్లు లాంటిది అని, అయినా కానీ సినిమా థియేటర్ లో కరోనా అనేది సోకే అవకాశం లేదని.. ఎందుకంటే అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ ఒక వైపుగానే కూర్చునే పరిస్థితి ఉంటది అని చెప్పుకొచ్చాడు. సినిమా వ్యాపారం థియేటర్ వల్ల అనేక లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని, సినిమా ధియేటర్ చుట్టూ ఉండే షాపులు అదేరీతిలో సినిమా కోసం పనిచేసే టెక్నీషియన్లు నష్ట పోతున్నట్లు నాని స్పష్టం చేశారు.
Read More: Nani: నాని ఖాతాలో మరో అరుదైన రికార్డ్..!!
సినిమా థియేటర్లు అనే పటికి.. కేవలం నిర్మాతలు హీరోలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు కానీ చిన్న చిన్న షాపుల్లో కుటుంబాలు నష్టపోతున్నాయి దీనిపై ప్రభుత్వాలు స్పందించి అన్నట్టుగా నాని పేర్కొన్నారు. బార్లకు పబ్బులకు లేని నిబంధనలు సినిమా థియేటర్లకు ఎలా ఎలా అమలు చేస్తారు అన్న తరహాలో ప్రభుత్వాలను నాచురల్ స్టార్ నాని ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలో ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు ఇంకా ఇండస్ట్రీ పెద్దలు స్పందించిన క్రమంలో నాని చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా అదేరీతిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.