ప్రభాస్ గెస్ట్ హౌస్ తీర్పు రిజర్వ్

హైదరాబాద్, జనవరి 3:  సినీ నటుడు ప్రభాస్ భూ వివాదానికి సంబంధించి దాఖలైన పిటీషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్‌ లో  ఉంచింది.

హైదరాబాద్ శివారు రాయదుర్గంలో ప్రభాస్ గెస్ట్ హౌస్ ఉన్న 2081 గజాల స్ధలం ప్రభుత్వానికి చెందినదిగా రెవిన్యూ అధికారులు  ఆ అతిధి గృహాన్ని సీజ్ చేశారు. అధికారులు తన గెస్ట్ హౌస్‌ను మూసివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టుకు వెళ్ళారు.

ప్రభాస్ పిటీషన్‌పై గురువారం  హైకోర్టు విచారణ జరిపింది. ప్రభాస్ తరపు న్యాయవాదులు గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టిన స్ధలాన్ని ప్రభాస్ తండ్రి గతంలో కొనుగోలు చేశాడనీ, క్రమబద్ధీకరించేందుకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.  ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా సీజ్ చేశారని తెలిపారు.