న్యూస్ సినిమా

హీరో రామ్ పోతినేని ఏంటి పెళ్లి గురించి అడిగితే అలా అనేశాడు!!

హీరో రామ్ పోతినేని ఏంటి పెళ్లి గురించి అడిగితే ఆలా అనేశాడు!!
Share

ప్రస్తుత టాలీవుడ్‌ బ్యాచుల‌ర్ హీరోల లిస్ట్‌లో రామ్ పోతినేని కూడా ఒక‌రు. టాలీవుడ్ లోని మిగిలిన హీరో ల గురించి అప్పుడ‌ప్ప‌డు గాసిప్‌లు చక్కర్లు కొడుతూ ఉన్న, రామ్ మీద మాత్రం అలా వచ్చిన వార్త‌లు చాలా త‌క్కువ‌నే చెప్పొచ్చు. కానీ తను ఎప్పుడు ఏ ఇంట‌ర్వ్యూలకు వ‌చ్చినా ప్ర‌తిసారి రామ్‌కి ఎదురయ్యే ప్రశ్న ఒక్కటే! అలాగే రామ్ కూడా ఆ ప్ర‌శ్న ఎదురయ్యిన ప్ర‌తిసారి త‌ప్పించుకుంటూ ఉంటాడు. 

హీరో రామ్ పోతినేని ఏంటి పెళ్లి గురించి అడిగితే ఆలా అనేశాడు!!

ఇక ఇటీవ‌ల త‌న మూవీ రెడ్ రిలీజ్ అయిన విషయం మనకి  విదితమే. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో రామ్‌కు అదే ప్ర‌శ్న మళ్ళి ఎదురైంది. ఇక ఈ సారి మాత్రం రామ్ తప్పించుకోలేకపోయాడు. “మీ సీత‌ను ఎప్పుడు ప‌రిచ‌యం చేస్తారు?” అంటూ ఓ అభిమాని ప్ర‌శ్నించ‌గా అందుకు ఎవ్వరూ ఊహించని సమాధానం ఇచ్చాడు రామ్. చాలా సరదాగా నవ్వుతూ “ముందు నాకు ప‌రిచ‌యం అయ్యాక అప్పుడు మీకు ప‌రిచ‌యం చేస్తా” అని రామ్ సమాధానం ఇచ్చారు. ఇక ఈ విషయాన్నీ ఇంక ఏ మాత్రం పెద్ద‌గా సాగ‌తీయ‌కుండా అక్క‌డికి క‌ట్ చేసేసాడు. 

ఇక మరో అభిమాని లాక్‌డౌన్ సమయంలో అన్ని రోజులు ఇంట్లోనే ఉన్నందుకు ఎలా అనిపించింది అని ప్ర‌శ్నించ‌గా, తనకు మొద‌ట్లో కాస్త ఫ్రీ గా అనిపించింది కానీ, ఆ త‌రువాత చాలా బోర్ ఫీల్ అయినట్టు  తెలిపారు. 

ఈ లాక్‌డౌన్‌లో మీరు ఏదైనా కొత్త‌గా నేర్చుకున్నారా? అన్న ప్ర‌శ్న‌కు ఏం లేదని సమాధానం ఇచ్చారు రామ్ పోతినేని. అయితే ఖాళీ సమయాలలో తాను త‌న కోసం మాత్రమే వంట‌లు చేసుకుంటాన‌ని సరదాగా చెప్పుకొచ్చారు. అప్పుడప్పుడు వంటల మీద ఏదొక కొత్త ప్ర‌యోగాలు చేస్తూనే ఉంటాన‌ని అన్నారు. 


Share

Related posts

పూరి జగన్నాధ్ మాటల్లో జీవం.. పోడ్ కాస్ట్స్ వినాల్సిందే..

Muraliak

David Warner : రజినీకాంత్ గా మారిన డేవిడ్ వార్నర్..!!

sekhar

Karthika Deepam : బోల్తా కోట్టిన మౌనిత ప్లాన్ …!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar