NewsOrbit
న్యూస్

Tamil Nadu Elections : తమిళ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెమటలు పట్టిస్తున్న హీరో..!!

Tamil Nadu Elections తమిళనాడు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు కమల్ హాసన్. గురువారం రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎంజీఆర్‌ పోటీ చేసిన అలందూర్ నుంచి హైవోల్టేజ్ క్యాంపైనింగ్‌కు శ్రీకారం చుట్టారు. తమిళుల ఆరాద్యదైవం ఎంజీఆర్ అన్నా డీఎంకే పార్టీని స్థాపించింది కూడా అలందూర్‌లోనే.

కమల్‌హాసన్ తన ఎన్నికల ప్రచారంలో పదే పదే ఎంజీఆర్ పేరును ప్రస్తావిస్తున్నారు. తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్‌ మార్పునకు నాంది పలికారని, తాను కూడా అదే మార్పును సృష్టిస్తానని చెప్పుకొచ్చారు. ఎంజీఆర్ ఆశయాలను కొనసాగిస్తానని స్పీచ్‌లో అదరగొడుతున్నారు.

Tamil Nadu Elections
Tamil Nadu Elections

Tamil Nadu Elections ప్రచారంలో అందరి కన్నా ముందు!

తమిళనాడులో ముందుగా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది కమల్‌ హాసనే. ఇప్పటికే 27 ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి.. అప్పుడే సెకండ్‌ ఫేజ్‌ క్యాంపైన్‌ను కూడా ప్రారంభించారు. కమల్‌ హాసన్‌ దూకుడు చూసి కాంగ్రెస్‌ పార్టీ పొత్తుకు రెడీ అయింది. ఇప్పటికే, డీఎంకేకు మిత్రపక్షంగా ఉంది. ఈ సమయంలో కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యంను కలుపుకుంటే బాగుంటుందన్న ఆలోచన చేసింది. అయితే, ఈ పొత్తును అటు డీఎంకే, ఇటు మక్కల్ నీది మయ్యం తోసి పుచ్చాయి. ఈ ఎన్నికల్లో కనీసం 36 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాని, కేవలం 18 సీట్లు మాత్రమే ఇస్తామంటూ డీఎంకే ఆఫర్ చేస్తోంది. ఒకవేళ డీఎంకే గనక తగ్గకపోతే.. కాంగ్రెస్ పార్టీ కమల్‌ హాసన్‌ వైపు నడిచే అవకాశాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

రాటుదేలిన నాయగన్!

కలిసొచ్చే రాజకీయ పార్టీలతో కలిసి మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు కమల్ హాసన్. ఇప్పటికే హీరో శరత్‌కుమార్ పార్టీ ఆలిండియా సముత్వ మక్కల్‌ కట్చీతో కలిసి బరిలో దిగుతున్నారు. థర్డ్‌ ఫ్రంట్ సీఎం అభ్యర్ధి కమల్‌హాసనే అని శరత్‌కుమార్‌ చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు కమల్. మరోవైపు కోలీవుడ్‌లోని పలువురు బడా హీరోలతో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు కమల్ హాసన్ వ్యూహరచన చేశారు.

ప్రచారంలో భాగంగా యువత, మహిళలే లక్ష్యంగా హామీల వర్షం కురిపించారు. ఐదు లక్షల ఉద్యోగాలు, 50 శాతం రిజర్వేషన్లు, గృహిణులకు జీతం, ఒంటరి తల్లులకు ఆర్థిక సాయం, ఏ దిక్కూ లేని మహిళలకు ఉచిత షెల్టర్‌ వంటి హామీలు గుప్పించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీని, ప్రధాని మోదీని ఏకేశారు కమల్ హాసన్.

రెండు ముక్కలు తమిళంలో మాట్లాడి, తమిళ పద్యాలు చెప్పినంత మాత్రాన ప్రజలు ఓట్లేస్తారనుకోవడం అవివేకం అన్నారు. ఆ రోజులు ఎప్పుడో పోయాయని గట్టిగానే సమాధానం ఇచ్చారు. తమిళ భాష, తమిళ సంస్కృతి అమ్మకానికి సిద్ధంగా లేవని చెప్పుకొచ్చారు. నీట్‌, హిందీని ఎలా రుద్దుతున్నారో తమిళులందరికీ తెలుసని కామెంట్ చేశారు. మరోవైపు అన్నాడీఎంకే, బీజేపీ పొత్తుపైనా విమర్శలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు.మొత్తం మీద కమలహాసన్ తమిళనాడు రాజకీయాల్లో తన మార్క్ చూపించబోతున్నారనిపిస్తోంది.

author avatar
Yandamuri

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?