Big Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్ గ్యారెంటీ టాప్ ఫైవ్ లో అంటున్న తనిష్..!!

Share

Big Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో 19 మంది ఇంటి సభ్యులు అడుగుపెట్టి 24 గంటలు గడవకముందే ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ అని.. షాక్ లకు ఇవటానికి నాందిపలికిన బిగ్ బాస్ అదే రేంజ్ లో ఇంటిలో వాతావరణం ఉండేలా.. ఇంటి సభ్యుల మధ్య గొడవలు పట్టడంతో పాటు గ్రూపులు క్రియేట్ అయ్యేలా టాస్క్ లు ఇస్తున్నారు. కాగా ప్రస్తుతం ఇంటికి కెప్టెన్ గా సిరి సెలక్ట్ కావటంతో.. హౌస్ లో వాతావరణం మొత్తం పూర్తిగా మారిపోయింది. చాలా ఎనర్జిటిక్ కంటెస్టెంట్ గా సీజన్ ఫైవ్ లో సిరి రాణిస్తుంది. హౌస్ లో తొలి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన స్టార్టింగ్ నుండి సిరి ఎనర్జీ లెవెల్స్ ఎక్కడా తగ్గడం లేదు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో బాగా పోరాడి.. సిరి.. సీజన్ ఫైవ్ తొలి కెప్టెన్ గా హౌస్ లో చలామణి అవుతోంది.

Bigg boss season 5: Manas will be among top 5, actor predicts

ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్ హీరో బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ తనీష్.. తాజాగా సీజన్ ఫైవ్ గురించి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంటిలో ఉన్న సభ్యులలో ఖచ్చితంగా మానస్ టాప్ ఫైవ్ లో కి వెళ్తాడు అని తాము అంచనా వేస్తున్నట్లు తనిష్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మానాస్ మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి అని తనకి చాలా బాగా తెలుసని.. కచ్చితంగా హౌస్లో రాణిస్తాడు అని అనుకుంటున్నట్లు తనీష్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే తరుణంలో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గురించి తనకు పెద్దగా ఏమీ తెలియదని చెప్పారు. అతనితో కూడా పెద్దగా పరిచయం లేదని తెలిపారు. విషయం ఇలా.. దీప్తి సునయన సీజన్ 2 లో కంటెస్టెంట్ గా హౌస్ లో రాణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమెకు చేదోడువాదోడుగా చాలా క్లిష్ట సమయంలో తనీష్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది.

షణ్ముఖ్ జస్వంత్ కోసం దీప్తి సునయన

హౌస్ లో వీళ్లిద్దరి మధ్య ఉన్న వాతావరణం చూసి చాలామంది అప్పట్లో సంథింగ్ సంథింగ్ అని అనుకున్నారు. కానీ బయటకు వచ్చాక ఇద్దరం ఫ్రెండ్స్ అని.. మా మధ్య ఎటువంటి రిలేషన్ ఏది లేదని తెలియజేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్లో ఉన్న తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్ కోసం దీప్తి సునయన బయట బాగా కష్టపడుతూ ఉంది. యూట్యూబ్ స్టార్ గా షణ్ముఖ్ జస్వంత్ కి మంచి క్రేజ్ ఉండటంతో.. అతని హౌస్ లో ఎలాగైనా గెలిపించే రీతిలో బయట… దీప్తి సునయన బాగా కష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ ఎక్స్పీరియన్స్ కలిగిన కుర్ర హీరో తనీష్ మానస్ కచ్చితంగా టాప్ ఫైకి వెళ్తాడని.. కామెంట్ చేయటం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.

 

మరోపక్క మెగా బ్రదర్ నాగబాబు ఈసారి ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ కి మద్దతు తెలపడం జరిగింది. గత సీజన్ అభిజిత్ కి నాగబాబు సపోర్ట్ చేయడం తో.. బెనిఫిట్ పొందిన అభిజిత్ విన్నర్ గా నిలిచాడు. ఈ తరుణంలో ప్రియాంక సింగ్ కి నాగబాబు సపోర్ట్ చేయటం మరోపక్క తనిష్ మానస్ కి మద్దతు తెలపటం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఏదిఏమైనా ఈ సారి హౌస్ లో చాలామంది టాప్ సెలబ్రిటీలు యాంకర్లు ఉండటంతో.. ఇండస్ట్రీలో పేరుగాంచిన వాళ్లు .. ఒక్కొక్కరూ ఒక్కో కంటెస్టెంట్ కి బిగ్ బాస్ సీజన్ ప్రారంభంలోనే సపోర్ట్ చేయటం తో.. షో పై కొంచెం ఇంట్రెస్ట్ కలిగించే విధంగా మారింది.


Share

Related posts

జిహెచ్ఎంసి మేయర్ పీఠం పై మడత పేచీ : హై కోర్టులో మాజీ ఎమ్మెల్యే పిల్

Special Bureau

Eatela Rajendar: కేసీఆర్ త‌ర్వాత ఈట‌లే… గులాబీ పార్టీ నేత‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

sridhar

కౌన్ బనేగాలో క్యా “కియా”రా..!? ఆ బ్యూటీ అంటే ఇష్టం అంటూ జేబులోంచి ఫోటో తీసాడు..!!

bharani jella