న్యూస్

సినిమా కెరియర్ లో పవన్ బాటలో వైష్ణవ తేజ్..!!

Share

మెగా కాంపౌండ్ హీరోలలో అందరి క్రేజ్ ఒక ఎత్తు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొక ఎత్తు. హిట్టులకు ఫ్లాపాలకు సంబంధం లేకుండా.. పవన్ ని అభిమానులు ఎంతగానో అభిమానిస్తుంటారు. చాలా సేవ దృక్పథం కలిగిన వ్యక్తితో పాటు..తప్పు చేస్తే ప్రశ్నించే గుణం ఉన్న నాయకుడు కావడంతో…ఫ్యాన్స్ కళ్యాణ్ బాబుని..ఎంతగానో గౌరవిస్తారు. పవన్ హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా రాణించడం తెలిసిందే. 2002వ సంవత్సరంలో జానీ అనే సినిమాని పవన్ కళ్యాణ్ తానే దర్శకుడిగా మరియు హీరోగా చేయడం జరిగింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

hero vaishnav tej follows Pawan Kalyan

ఇంకా ఫైట్స్ కూడా పవన్ కంపోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ బాటలోనే మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ తేజ్ నడవడానికి రెడీ కావటం జరిగింది. మొదటి సినిమా “ఉప్పెన” తోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన వైష్ణవ తేజ్.. ప్రస్తుతం “రంగ రంగ వైభవంగా” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో వైష్ణవ తేజ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో డైరెక్షన్ చేస్తా. ఇప్పటికే స్టోరీ కూడా రాసుకోవడం జరిగింది.

hero vaishnav tej follows Pawan Kalyan

అన్నయ్య సాయిధరమ్ తేజ్, బావ వరుణ్ తేజ్ తో కలిపి మల్టీస్టారర్ తీయాలనుకుంటున్నాను త్వరలో ఆ సినిమా వస్తుంది అని పేర్కొన్నారు. దీంతో వైష్ణవ తేజ్ కామెంట్లకు మెగా ఫ్యాన్స్ చిన్న మావయ్య పవన్ బాటలోనే వెళ్తున్నాడు అంటూ రియాక్ట్ అవుతున్నారు. అన్ని రకాల వైవిధ్యమైన సినిమాలు చేసే తరహాలో వైష్ణవ తేజ్ సినిమాల ఎంపిక ఉండటం విశేషం. మొదటి సినిమాతోనే ఎంతో అనుభవం ఉన్న నటుడిగా.. ఉప్పెనలో బాగా ఆకట్టుకోవడం జరిగింది. మరి దర్శకుడిగా వైష్ణవ తేజ్ ఏ మాత్రం ఆకట్టుకొంటాడో చూడాలి.


Share

Related posts

Bigg boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో వచ్చేసింది..బుల్లెట్లతో దుమ్ము దులిపేసిన నాగార్జున

GRK

చిరంజీవి ఆచార్య : అదేంటి రిలీజ్ కి ముందే ప్లాప్ టాక్ వచ్చేసింది .. కొరటాల శివా ఏంటయ్యా ఇది ?

GRK

మోడీ మీద వారందరికీ వరసగా కంప్లైంట్ లు.. మోడీ నచ్చడం లేదు..!

Varun G