21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
న్యూస్ సినిమా

Hero Vikram: విక్రమ్ అభిమానులకు మరోసారి నిరాశ.. ఇక ఆశలు వదులుకున్నట్లేనా..

Share

Hero Vikram: భారీ అంచనాలతో రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ 1 సినిమా అనుకున్న ఫలితాన్ని అందించలేక పోయింది. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొదటి భాగం చూసిన తరువాత రెండో భాగం చూడాలని ఇంట్రెస్ట్ చాలా వరకు తగ్గిపోతుందనే చెప్పాలి. తమిళ మీడియా మాత్రం ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. టికెట్లు కూడా దొరకనంత బిజీగా థియేటర్స్ ఉన్నాయని హంగామా చేస్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి వేరుగా ఉంది. వీకెండ్‌లో కాకుండా చెన్నై బుక్ మై షోలో టికెట్స్ ఈజీగా దొరుకుతున్నాయి. బాక్సాఫీస్ కలెక్షన్ గురించి చెప్పాలంటే కాస్త సమయం ఎదురు చూడక తప్పదు.

Hero Vikram: విక్రమ్ ఫ్యాన్స్ ఫుల్ డిజపాయింట్‌మెంట్

Hero Vikram
Hero Vikram

విక్రమ్ రోల్ పొన్నియన్ సెల్వన్ మూవీలో ఒక రేంజ్‌లో ఉంటుందని బిల్డప్పు ఇచ్చారు. కానీ టైటిల్ రోల్ చేసింది జయం రవిగా చూపించడం తో అడియన్స్ అందరూ షాక్ అయ్యారు. ఇక విక్రమ్ రోల్ ఇంట్రో సెకండ్ హాఫ్ లో ఉంటుంది. రెండు గంటల 50 నిమిషాలు సినిమా ఉండగా అందులో చియాన్ విక్రమ్ పావుగంట కంటే ఎక్కువగా కనిపించడు. సినిమాలో కనీసం ఒక పాట కూడా పెట్టలేదు. స్టార్టింగ్‌లో ఒక చిన్న యుద్ధంలో, ఆ తరువాత రెండు మూడు ఎమోషనల్ సీన్స్ లో తప్ప మరే సీన్‌లో కనిపించడు. ఫస్టాఫ్‌లో కార్తీ, సెకండాఫ్‌లో జయం రవి డామినేషన్‌లో సినిమా కానిచ్చేసారు. విక్రమ్ పాత్ర చాలాసేపు కనపడకపోవడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

ఇక ఆశ వదులుకున్నట్లేనా

Hero Vikram
Ponniyin Selvan: I

పీఎఫ్ 2లో అయినా విక్రమ్ పాత్ర పూర్తిస్థాయిలో ఉంటుందేమో చూడాలి. పీఎఫ్ వన్‌లో విక్రమ్ పాత్ర చూడటానికే థియేటర్ కి వెళ్లిన వారు చాలామంది ఉంటారు. కాబట్టి పిఎఫ్1 లో విక్రమ్ పాత్ర ఎక్కువగా చూపించి ఉంటే బాగుండేది. కానీ అలా జరగలేదు కాబట్టి విక్రమ్ ఫ్యాన్స్ పిఎఫ్ వన్ బాగా హర్ట్ అవుతున్నారు. ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతారు. ఈ సినిమా దసరాలోగా థియేటర్ల నుంచి బయటికి వచ్చేలానే ఉంది.


Share

Related posts

Panchayat polls : ఏపిలో కొనసాగుతున్న మూడవ దశ పోలింగ్

somaraju sharma

Gaurav Khanna: పారా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కోసం తన 15 ఏళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన కోచ్ గురించి తెలుసుకుందాం..!

arun kanna

Corona Vaccine : ఆ దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే డ్రింకులు ఫ్రీ..!!

sekhar