Puneeth – Vishal: పునీత్ రాజ్‌కుమార్ మరణాంతరం హీరో విశాల్ సంచలన నిర్ణయం.. ఆ బాధ్యత నాదే అంటూ ప్రకటన …!

Share

Puneeth – Vishal: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ మరణం కన్నడ ఇండస్ట్రీనే కాకుండా మొత్తం సినీలోకాన్నే విషాదంలోకి నెట్టింది. మూవీలోనే హీరోగా కాకుండా సమాజం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి రియల్ హీరోగా నిలిచిపోయారు పునీత్ రాజ్‌కుమార్. 26 అనాథాశ్రమాలు, 45-ప్రీ సూళ్లు, 16-వృద్ధాశ్రమాలతో పాటు 19- గోశాలలను కట్టించాడు పునీత్ రాజ్‌కుమార్. తన కండ్లను సైతం దానం చేసి మనవాతా దృక్ఫతాన్ని చాటుకున్నాడు రాజ్‌కుమార్.

Puneeth: పునీత్ రాజ్‌కుమార్ లవ్‌స్టోరీలో కన్నీళ్లు పెట్టించే సన్నివేశం ఇదే !

విశాల్ డైనమిక్ డెసిషన్..

తెలుగు, తదితర భాషల్లో మంచి హిట్ మూవీస్ అందుకున్న విశాల్.. రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నాడు. పేదప్రజలకు, రైతులకు సాయం చేస్తూ వారిని ఆదుకుంటున్నారు. పునీత్ మృతి తర్వాత విశాల్(Vishal) సంచలమైన నిర్ణయం తీసుకున్నారు. తన స్నేహితుడు పునీత్.. చదివిస్తున్న సుమారు 1500 మంది విద్యార్థుల బాధ్యత తాను తీసుకుంటున్నానని ప్రకటించాడు. ఇప్పటికే తన మూవీస్ టికెట్ ధరల్లో.. ఒక్కో టికెన్ నుంచి ఒక్కో రూపాయిని రైతుల సహాయం కోసం కేటాయిస్తున్నాడు. ఇక తనను కలిసేందుకు వచ్చిన వారు బొకేలు తీసుకురావొద్దని ఆ డబ్బులను ఆడపిల్లల చదువుకు ఉపయోగించాలని కోరుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం పునీత్ (Puneeth) బాధ్యతలను సైతం తీసుకుని అందరి అభిమానాన్ని గెలుచుకుంటున్నాడు విశాల్.


PUNEETH RAJ KUMAR: ఆ కోరిక నెరవేరకుండానే పునీత్ రాజ్‌కుమార్ చనిపోయారు..

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పుతీన్.. ఇక అప్పటి నుంచి అనేక చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ పేరు సంపాదించుకున్నాడు. అవార్డులు సైతం గెలుచుకున్నాడు. తెలుగులో పూరి జగన్నాథ్( puri Jagannath) డైరెక్షన్‌లో రవితేజ హీరోగా వచ్చిన ఇడియట్ మూవీ ఎంత హిట్ కొట్టిందో అందరికీ తెలుసు.


Puneeth: పునీత్ రాజ్‌కుమార్ లవ్‌స్టోరీలో కన్నీళ్లు పెట్టించే సన్నివేశం ఇదే !
ఆ మూవీని అప్పుగా రీమేక్ చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు పునీత్. అప్పటి నుంచి అనేక మూవీస్‌లో యాక్ట్ చేస్తూ కన్నడ పవన్ స్టార్‌గా ఎదిగారు. ఎంత ఎదిగినా అందరితో కలిసిపోయి ఉండటం పునీత్ నేచర్.. అతను భౌతికంగా దూరమైనా ఎప్పటికీ తమ మనసులో శాశ్వతంగా నిలిచిపోయారని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు.


Share

Related posts

శ్రీదేవి డ్రామా కంపెనీ.. త్వరలో ఈటీవీలో.. యాంకర్ ఎవరో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే?

Varun G

కరోనా టెన్షన్ లో కర్నూలు డాక్టర్లు !

Siva Prasad

” నీవి బావున్నాయి .. నేను ముట్టుకోవచ్చా ” అన్నాడు – టాప్ సీక్రెట్ చెప్పిన హీరోయిన్

GRK