ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. మొన్న సంక్రాంతి రోజు షూటింగ్ మొదలైన ఈ చిత్రానికి ప్రభాస్ కేవలం ఆరు నెలలు మాత్రమే డేట్స్ ఇచ్చాడని సమాచారం. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటివరకు అప్డేట్ లేదు. అభిమానుల్లో ఈ అంశమే ఆసక్తికరమైన చర్చగా కొనసాగుతోంది.
ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో జోరుమీదున్నాడు. కాబట్టి అతడి సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది అంటే ఆమె స్టార్ తిరిగిపోతుంది. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన అప్డేట్ ఏమిటి అంటే శృతి హాసన్ ప్రభాస్ సరసన ఈ సలార్ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయిందంట. రవితేజ ‘క్రాక్’ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శృతి హాసన్ ప్రభాస్ సరసన ఒకవేళ నటిస్తే వీరు ఇద్దరూ జోడి కట్టడం ఇదే మొదటిసారి అవుతుంది.
Prabhas Salaar : చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ సరసన శృతిహాసన్
చాలా గ్యాప్ తీసుకున్న శృతిహాసన్ సినిమాతో మళ్ళీ ‘క్రాక్‘ సినిమా తో గట్టిగా కమ్ బ్యాక్ ఇచ్చింది. మొదట్లో డార్లింగ్ సరసన ఈ సినిమాలో దిశాపటానీ నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. అయితే అవి కేవలం రూమర్స్ అని తేలిపోయింది. తాజాగా ప్రభాస్ సరసన నటించే లక్కీ ఛాన్స్ శృతి కొట్టేసిందన్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
అసలు ప్రభాస్– శృతి కాంబినేషన్ ఎవరూ ఊహించి ఉండరు. అంతేకాకుండా సినిమాలనుండి గడ్డు పరిస్థితిని ఎదుర్కొని చాలా కాలం గ్యాప్ తీసుకున్న శృతి మళ్లీ ఈ రేంజ్ లో ఒక పాన్ ఇండియా స్టార్ లో జతకదుతుందని అయితే ఎవరూ కలలో కూడా అనుకుని ఉండరు. అయినా శృతిహాసన్ కు టాలెంట్ ఏమీ తక్కువ కాదు కానీ సరైన సినిమాలు రాలేదు. ఇఅక్ ఒక్కసారిగా ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ సరసన నటిస్తే శృతిహాసన్‌కు కూడా ఇంకా ఆఫర్లు పోటెత్తుత్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు