గోవా బ్యూటీ ఇలియానా తెలుసు కదా. తను ఎప్పుడో టాలీవుడ్ ను మరిచిపోయింది. కానీ.. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించింది. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే తెలుగు ఇండస్ట్రీని వదిలి.. బాలీవుడ్ వైపు పరుగులు తీసింది. అయితే.. అక్కడ ఇలియానాకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. తన సినిమాలు అక్కడ ఆడలేదు. అయినా టాలీవుడ్ వైపు చూడలేదు. అక్కడే ఫిక్స్ అయిపోయింది. ఈ మధ్య రవితేజ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోకస్ అంతా తన ఫిట్ నెస్ మీదనేనట.
ఎందుకంటే.. ఆ మధ్య ఈ సుందరి బాగా లావెక్కింది కదా. తను లావెక్కడం.. తనకే నచ్చలేదట. ఏంటి నా బాడీ ఇలా తయారైంది. నా బాడీ చూసి ఎవరు ఏమనుకుంటారో ఏమో? ఇలా తయారయ్యాను ఏంటి? నేను ఎదుటి వాళ్లకు ఎలా కనబడుతున్నానో ఏమో? అంటూ తెగ బాధపడిపోయింది.
నా తొడలు పెద్దవిగా ఉండేవి.. నా నడుము సన్నగా ఉన్నా… వక్షోజాలు కూడా అంత పెద్దగా ఉండేవి కావు. నా వెనుక భాగం కూడా పెద్దదిగా ఉండేది. నా పెదాలు కూడా అందంగా ఉండేవి కావవు.. ఎందుకు నేను అలా తయారయ్యాను.. అని బాధపడుతూ కూర్చోవడం కన్నా.. కానీ.. ఆ భయాన్ని వదిలేసి.. నన్ను నేను ఇప్పుడు మలుచుకున్నాను. నా అందం నాదే. నాకు నేనుగా ప్రస్తుతం నిలబడ్డాను.. అంటూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పేద్ద పోస్టే పెట్టింది ఈ సుందరి.
అంతే కాదు.. తను ప్రస్తుతం నాజూకుగా తయారయిందని చెప్పడానికి ఓ ఫోటోను కూడా పెట్టింది. ఇప్పుడు ఆ పోస్టుతో పాటు ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
https://www.instagram.com/p/CFzTPQHA7UN/?utm_source=ig_embed