Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీ లో తిరుగులేని హీరో లలో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తిరుగులేని మార్కెట్.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన పవన్ సినిమా రిలీజవుతుందంటే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే కలెక్షన్లు బీభత్సంగా ఉంటాయి. పవన్ సినిమా రిలీజ్ అయ్యే టైం లో దాదాపు వారం రోజులు అటుఇటుగా ఎవరు కూడా సినిమాలు రిలీజ్ చేయటానికి సాహసించరు. అంతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ ఉన్న పవన్ పక్కన హీరోయిన్ గా చేయాలని ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు వెయిట్ చేసే పరిస్థితి.
అయితే ఈ అవకాశం హీరోయిన్ సాయి పల్లవి కి ఇటీవల రావడం జరిగిందట. ఈ క్రమంలో సాయి పల్లవి పవన్ సినిమాకి నో చెప్పినట్లు ఇండస్ట్రీలో మీడియాలో లేటెస్ట్ టాక్. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాల షూటింగులు కంప్లీట్ అయిన తర్వాతే మిగతా సినిమాల షూటింగ్ గురించి ఆలోచించడం జరుగుతుందని.. అంతవరకు ఏ సినిమా కమిట్ అవ్వడం అని సాయిపల్లవి డిసైడ్ అవ్వడం జరిగింది అని టాక్.
దీంతో హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల చాలా సినిమాలు వదులుకున్న ట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క ఈ ఏడాది సాయిపల్లవి నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన “లవ్ స్టోరీ” రిలీజ్ కానుండగా.. మరోపక్క రానా తో నటించిన “విరాటపర్వం” కూడా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ టోన్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ చేతిదాకా వచ్చిన సాయి పల్లవి వదులుకోవటం అనే వార్త ఇండస్ట్రీలో అదే రీతిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరో పక్క ఈ వార్తలపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. పవన్ సినిమా వదులుకొని ఛాన్స్ ఏ హీరోయిన్ కి లేదు.. ఇదంతా గాసిప్స్.. అంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు.