Balakrishna: “పెళ్లి సందD” మూవీ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీలా.. మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకోవడం తెలిసిందే. కన్నడ, తెలుగు ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ శ్రీ లీలా.. క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే స్టార్ హీరో రవితేజతో పెద్ద సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో బాలయ్య బాబు సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
విషయంలోకి వెళితే బాలయ్య బాబు తో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య బాబు 50 సంవత్సరాల.. పెద్ద వయసు ఉన్న వ్యక్తిగా కనిపించనున్నాడట. అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు కూతురుగా శ్రీ లీలా..నీ తీసుకునే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తండ్రి కూతురు నేపద్యంలో సినిమా ఉంటుందని.. అయితే ఎక్కువ ఫోకస్ మొత్తం బాలయ్య పాత్ర పైనే ఉండే రీతిలో… కథ ఉండబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
మాస్ కథాంశం నేపథ్యంలో తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉండే రీతిలో అనిల్ రావిపూడి.. ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ లో బాలయ్య బాబు జాయిన్ కానున్నారని సమాచారం. ప్రస్తుతం అనిల్ రావిపూడి “F3” సినిమా రిలీజ్ కార్యక్రమాలలో ఫుల్ బిజీగా ఉన్నారు. మే 27వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు అనిల్ రావిపూడి పూర్తిగా బాలకృష్ణ సినిమా పై ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…