ప్రతి సంవత్సరం ఇండస్ట్రీకి పదుల సంఖ్యలో హీరోయిన్లు వస్తువుంటారు. వారిలో కొంతమంది మంచి అవకాశాలతో దుసుకెళ్తుంటే కొంతమంది మాత్రం సరైన అవకాశాలు లేక వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఇదంతా ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. కొంతమంది హీరోయిన్స్ ఐదు లేదా పదేళ్లు మాత్రమే తమ కెరీర్ని కొనసాగిస్తారు. కానీ ఎంత టాలెంట్ ఉన్న కూడా అవకాశాలు లేక తమ కెరీర్ని కోల్పోతుంటారు. అలా కెరీర్ కోల్పోయిన కొంతమంది హీరోయిన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాశి ఖన్నా
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రాశి ఖన్నా. కానీ తన మొదటి సినిమాలోనే ఈ అమ్మడు చేదు అనుభవాన్ని చవి చూసింది. ఎందుకో కానీ ఆమెకి అసలు అదృష్టం కలిసి రావడం లేదు. రాసి ఖన్నా తర్వాత వచ్చిన హీరోయిన్స్ చాలామంది స్టార్ డమ్ అనుభవిస్తున్నారు. కానీ ఆమె మాత్రం సరైన హిట్ లేక స్టార్ హీరోయిన్గా కుదురుకోలేక పోతుందనే చెప్పాలి. ఇటీవల రిలీజ్ అయిన థాంక్యూ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడు కేరిర్ ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు.
రెజీనా కసాండ్రా
10 సంవత్సరాల క్రితం శివ మనసులో శృతి అనే సినిమాతో రెజీనా కాసాండ్ర తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా వచ్చి దశాబ్ద కాలం గడిచిన కూడా రెజీనాకు సరైన హిట్ తగలడం లేదు. చివరికి OTTలో కూడా యాక్ట్ చేసి అక్కడ కూడా ఫ్లాప్ గా నిలిచింది. దాంతో రెజీనా సినిమాలో కనిపించడం కష్టమే అంటున్నారు. అంతేకాదు, రెజీనా ఒక హీరోతో ప్రేమలో పడటం వల్లే కెరీర్లో వెనక పడటానికి కారణమని రూమర్స్ వచ్చాయి. అలా రెజీనా కూడా కనుమరుగయ్యే హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే 2012లో విడుదల అయిన అందాల రాక్షసి సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీకి వచ్చి దశబ్ద కాలం గడిచిన సరైన హిట్ అందుకోలేకపోయింది. ఇక లావణ్య పరిస్థితి కూడా గాలిలో దీపంలా ఉంది.