Senior Heroines: ఫేడవుట్ అవకుండా సత్తా చాటుతున్న సీనియర్ హీరోయిన్స్.

Share

Senior Heroines: సౌత్ సినిమా ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనూ కొందరు సీనియర్ హీరోయిన్స్ ఇంకా అవకాశాలు అందుకుంటూ మంచి సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. సాధారణంగా ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో తప్ప మిగతా సౌత్ ఇండస్ట్రీస్‌లలో హీరోయిన్స్‌కి అంత లాంగ్ టైం ఉండదనే మాట వినిపిస్తుంది. హీరోలు 60 ఏళ్ళు పైబడినా కూడా రిటైర్‌మెంట్ అనేది లేకుండా హీరోలుగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తుంటారు. ఇది అన్నీ ఇండస్ట్రీలోనూ ఉంది. కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

heroines who are not faded out even after marriage..
heroines who are not faded out even after marriage..

తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి 60 ఏళ్ళు దాటాయి. అయినా ఆయన ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. పదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా అదే వాడి అదే వేడి. ఒంట్లో వేడి అసలు తగ్గలేదు. బాడీలో అదే గ్రేస్..డాన్సులు కూడా మునుపటిలాగే చేస్తున్నారు. ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఇవన్నీ ఆయన హీరోగా చేస్తున్నవే. అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్ సీనియర్ హీరోల లిస్ట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరంతా ఇంకా హీరోలుగా
కంటిన్యూ అవుతున్నారు.

Senior Heroines: సీనియర్ హీరోయిన్స్ వీరికి జోడీగా నటించే అవకాశాలను అందుకుంటూ జోరు కొనసాగిస్తున్నారు.

బాలీవుడ్‌లో కూడా అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ లాంటి వారు హీరోలుగా కంటిన్యూ అవుతున్నారు. అయితే కొన్ని సినిమాలలో ఈ సీనియర్ హీరోలకీ అలాంటి సీనియర్ హీరోయిన్సే కావాల్సి ఉంటుంది. ఆ అవకాశాలను పెళ్ళై ఫేడవుట్ కాకుండా ఇంకా తరగని అందంతో మెరిసిపోతున్న సీనియర్ హీరోయిన్స్ వీరికి జోడీగా నటించే అవకాశాలను అందుకుంటూ జోరు కొనసాగిస్తున్నారు. వారిలో ఎక్కువగా అవకాశాలు అందుకుంటుందీ అంటే మీనా, ఖుష్బూ.
వీరిద్దరికీ ఇప్పుడు అటు తమిళం, ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలలో మంచి క్రేజ్ ఉంది.

మీనా మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాలో నటించి హిట్ అందుకుంది. ఈమె మోహన్ లాల్ సరసన సరిగ్గా సరిపోయింది. దాంతో అదే సినిమాను తెలుగులో రీమేక్ చేసినప్పుడు ఇక్కడ వెంకటేశ్ సరసన తీసుకున్నారు. దృశ్యం రెండు భాషలలో మంచి హిట్ సాధించింది. అంతేకాదు అదే సినిమా సీక్వెల్‌లో కూడా రెండు భాషలలో మీనా నటించి హిట్ అందుకోవడం విశేషం. ప్రస్తుతం మీనా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అణ్ణాత్త సినిమాలో నటిస్తోంది.

Senior Heroines: వీరికంటే మరో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ చాలా ప్రత్యేకం అని చెప్పాలి.

ఇక ఖుష్బూ కూడా ఇప్పుడు మంచి క్రేజీ ఆఫర్ అందుకుంటోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసితో చాలాకాలం తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఆమె రజనీకాంత్ నటిస్తున్న అణ్ణాత్త సినిమాలో నటిస్తోంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి ..మోహన్ రాజా దర్శకత్వంలో నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. వీరికంటే మరో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఆమె కోసం ప్రత్యేకంగా పాత్రలు తయారు చేస్తున్నారు
దర్శక, నిర్మాతలు.


Share

Related posts

Chiranjeevi : చిరు మూవీలో 20 నిమిషాల కోసం ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్న టాప్ హీరోయిన్..!!

sekhar

Today Gold Rate: మళ్లీ జోరు పెంచిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవే..

bharani jella

ఇప్పుడు మేమున్న కష్టాల్లో ఇలాంటి పనులు చేస్తారా ..?

GRK