తెలంగాణ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. ముందు సెక్రటేరియట్ కూల్చివేత కు అనుమతి ఇచ్చిన హైకోర్టు దానికి వ్యతిరేకంగా నమోదైన పిటిషన్లను పరిశీలించిన మీదట తాత్కాలికంగా సెక్రటేరియట్ కూల్చివేత ప్రక్రియ ఆపమని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సెక్రటేరియట్ కూల్చివేత వలను హైదరాబాద్ లోని అనేక రోడ్లు బ్లాక్ కాగా సంక్షోభ సమయంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. అంతే కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఆ పనులు మొదలు పెట్టాలని ప్రస్తుతానికి హై కోర్టు సూచించింది.
సోమవారం వరకు సెక్రటేరియట్ కూల్చివేత పనులను తక్షణమే ఆపివేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే అన్నీ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే తాము కూల్చివేతను ప్రారంభించామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పనిని ఆపడం కష్టమని పేర్కొంది. మరి ఈ విషయంలో చివరికి ఏమవుతుందో వేచి చూడాలి.