Highway Killer: థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని హైవే కిల్లర్!ఈ గ్యాంగ్ మోడస్ ఒపరాండీ ఏమిటంటే??

Share

Highway Killer: హై వే కిల్లర్ అన్న పేరుతో అద్భుతమైన థ్రిల్లర్ సినిమా తీసేంత రేంజ్ లో మున్నా గ్యాంగ్ నేర చరిత్ర ఉంది. ఈ గ్యాంగ్ ఆకృత్యాలు, అరాచకాలు, హత్యలు,వారిని వెంటాడి పట్టుకున్న పోలీస్ ఛేజింగ్ సీన్లు..వారెవ్వా..ఏ సినిమాకైనా ఇంకేం కథాశం కావాల్సి ఉంటుంది?చేసిన ఘోరమైన నేరాల కారణంగా పన్నెండు మంది కి ఉరిశిక్ష పడిన నేపధ్యంలో మున్నా గ్యాంగ్ నేరచరిత్రపై ఒక ప్రత్యేక కథనం ఇది.

Highway Killer Activities looks like thriller movie
Highway Killer Activities looks like thriller movie

అసలు ఎవరీ మున్నా?

ఈ గ్యాంగ్ లీడర్ మున్నా సొంతూరు కనిగిరి.అల్లరి చిల్లరిగా తిరిగేవాడు.బంధువులు స్నేహితులతో కలిసి ఒక ముఠాను ఏర్పరుచుకున్నాడు.2002 లో కుటుంబ వివాదం నేపథ్యంలో సమీప బంధువును హత్య చేశాడు.ఆ తర్వాత గుప్తనిధులు ఎక్కడున్నాయో తనకు తెలుసంటూ వాటిని వెలికి తీస్తానంటూ పలువురిని మోసం చేశాడు.2008 లో అత్తగారి ఊరైన ఒంగోలు చేరాడు.తన వెంటే గ్యాంగును కూడా తెచ్చుకున్నాడు.దారుణ మారణకాండకు తెరదీశాడు

Highway Killer: మున్నా మోడస్ ఒపరాండీ ఏంటంటే?

గుప్తనిధుల తవ్వకం మాస్క్ తీసేశాక మున్నా జాతీయ రహదారులపై వెళ్లే ఇతర రాష్ర్టాల వీరు అటుగా వచ్చి ఐరన్ లోడు లారీని ఆపుతారు ఐరన్ లోడ్ లారీలను టార్గెట్ చేసుకున్నాడు .తన గ్యాంగ్ ని ఒంగోలులో లోని లాడ్జీల్లో పెట్టేవాడు.ఒక కారేసుకుని రాత్రిపూట జాతీయ రహదారిపైకి వెళ్లేవాడు.అనుచరులు బైకులపై అతడిని అనుసరించేవారు.వీరు జాతీయ రహదారిపై వచ్చే ఐరన్ లోడ్ లారీలను ఆపేవారు.తమను హైవే తనిఖీ సిబ్బంది గా చెప్పుకుంటూ లారీ డ్రైవర్ క్లీనర్ లను కారులో ఉండే మున్నా దగ్గరకు తీసుకు వచ్చేవారు. మున్నా వారితో మాట్లాడుతుండగానే అనుచరులు వారి వెనుక వైపు నుండి గొంతుకు నైలాన్ తాళ్లు వేసి ఊపిరి ఆడనీయకుండా చేసి చంపేసేవారు.అనంతరం మృతదేహాలను గోతాల్లో కుక్కి మున్నా కారు డిక్కీలో వేసి సమీపంలో ఉండే నదీ పరివాహక ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ గోతులు తీసి ఆ మూటలను పూడ్చేసేవారు.

Read More: Today Gold Rate: నేటి బంగారం, వెండి ధరలు ఇవే..!!

ఆ తర్వాత ఏం జరిగేది?

చాలా ముందు చూపుతో మున్నా అంతకుముందే మద్దిపాడు మండలంలో హైవే సమీపంలో ఒక గోడౌను ను లీజుకు తీసుకున్నాడు. డ్రైవర్ క్లీనర్లను చంపేసిన తర్వాత ఆ ఇనుము లోడు లారీని ఈ గోడౌన్ కి తీసుకొచ్చేవారు.అక్కడ లారీని తుక్కుగా మార్చేవారు.అందులోని విడిభాగాల్ని అమ్మేసుకునే వారు.ఇనుమును కూడా అప్పటికే తమతో కాంట్రాక్ట్లో ఉన్న వ్యాపారులకు ఇచ్చేసి అందినంత తీసుకునేవారు.ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసే వారు. ఎప్పుడైతే డబ్బు అయిపోతుందో మళ్లీ నేషనల్ హైవే మీద పడి ఇంకో లారీని ఎంచుకునేవారు.హత్యాకాండలు కొనసాగించేవారు.ఈ విధంగా ఎనిమిదిమంది లారీ సిబ్బందిని ఈ గ్యాంగ్ మట్టుబెట్టింది. గుప్తా నిధుల వ్యవహారాల్లో మరో ఐదు మందిని చంపేసింది.మొత్తం పదమూడు మందిని అంతం చేసిన ఈ గ్యాంగ్ చివరకు పోలీసులకు పట్టుబడి ఉరి కంబం ఎక్కనున్నది!

 


Share

Related posts

Corona Death: కళ్లముందే నాన్న మరణం..! తల్లడిల్లిన యువతి..!!

somaraju sharma

కరోనా మహమ్మారి.. ఏపీనే సేఫ్‌ అనుకుంటున్న జనాలు..?

Srikanth A

త్రివిక్రమ్ మరీ మరీ చెప్పి ఒప్పించాడు – ఇష్టం లేకపోయినా ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్ !

GRK