NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Hijab Controversy: ప్రకాశం జిల్లాకు పాకిన హిజాబ్ వివాదం..

Hijab Controversy: దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మొదలైన హిజాబ్ వివాదం ఇటీవల ఏపికి సైతం తాకింది. ఇటీవల విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ వివాదం తెరపైకి వచ్చింది. నిత్యం హిజాబ్ ధరించే కళాశాలకు వస్తున్న విద్యార్ధినులను కళాశాల సిబ్బంది అడ్డుకున్నారు. కళాశాలకు బుర్ఖా ఎందుకు వేసుకొచ్చారు అని ప్రిన్సిపాల్ ప్రశ్నించడంతో వివాదం తలెత్తింది. విద్యార్ధినుల తండ్రులు, మత పెద్దలు, పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది, విద్యార్థినులను కళాశాలలోకి అనుమతించారు.

Hijab Controversy in prakasam dist
Hijab Controversy in prakasam dist

Read More: Hijab Controversy: విజయవాడ లయోలా కాలేజీలో హిజాబ్ వివాదం..అధికారుల చొరవతో పరిష్కారం..

Hijab Controversy:  యర్రగొండపాలెం హైస్కూల్ లో

తాజాగా ప్రకాశం జిల్లాలోనూ హిజాబ్ వివాదం చెలరేగింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని ఓ హైస్కూల్ లో యాజమాన్యం ముస్లిం విద్యార్ధినులను అడ్డుకుంది. హిజాబ్ తొలగించి స్కూల్ కు రావాలని చెప్పడంతో విద్యార్ధినులు విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు ఈ విషయాన్ని మత పెద్దల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు హైస్కూల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. చాలా కాలం నుండి హిజాబ్ ధరించే స్కూల్ కు వస్తున్న తమ పిల్లలను ఇప్పుడు అడ్డుకుని కొత్తగా హిజాబ్ తీసివేసి రావాలని అనడం ఏమిటని వారు ప్రశ్నించారు. స్కూల్ యాజమాన్యం తీరును వారు తీవ్రంగా వ్యతిరేకించారు. మత పెద్దల ఆందోళనతో స్కూల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో హిజాబ్ వివాదం నేపథ్యంలో వారం రోజుల పాటు విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు, సుప్రీం కోర్టులోనూ విచారణ జరుగుతోంది.

సమాచారం తెలిసిన ఎస్ఐ సురేశ్, మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు హైస్కూల్ ద్దకు చేరుకుని వారితో మాట్లాడారు. దీనిపై ప్రిన్సిపాల్ కోటిరెడ్డి వివరణ ఇచ్చారు. తాను హిజాబ్ ధరించవద్దని చెప్పలేదనీ, హజరుకు గుర్తు పట్టడం ఇబ్బందిగా ఉందని ముఖానికి ముసుగు ధరించవద్దని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు. విద్యార్ధినుల తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కాగా హిజాబ్ ను వివాదం చేయవద్దని అన్ని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఎంఇఓ ఆంజనేయులు చెప్పారు. ఈ వివాదంపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?